రాష్ట్ర మార్కెట్లో హీరో ఇగ్నైటర్ 125సీసీ బైక్ విడుదల

ప్రపంచపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా) ఇటీవల దేశీయ విపణిలో ప్రవేశపెట్టిన 125సీసీ మోటార్‌సైకిల్ 'హీరో ఇగ్నైటర్' ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో కూడా లభ్యం కానుంది. రాష్ట్ర మార్కెట్లో హీరో ఇగ్నైటర్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ.59,031 (డిస్క్ బ్రేక్స్, సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్), రూ.56,996 (డ్రమ్ బ్రేక్స్, సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్)లుగా ఉన్నాయి.

హీరో ఇగ్నైటర్‌లో ఉపయోగించిన 124.77సీసీ ఏటిఎఫ్‌టి సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ 8000 ఆర్‌పిఎమ్ వద్ద 11 బిహెచ్‌పిల శక్తిని, 5000 ఆర్‌పిఎమ్ వద్ద 11 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హోండా అందిస్తున్న 125సీసీ బైక్ స్టన్నర్ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని హీరో మోటోకార్ప్ ఈ కొత్త ఇగ్నైటర్ బైక్‌ను తయారు చేసింది. ఇది మంచి పెర్ఫామెన్స్‌తో పాటుగా మెరుగైన మైలేజ్‌ను కూడా ఆఫర్ చేస్తుంది.

హీరో ఇగ్నైటర్ 125సీసీ బైక్‌లో ఉండే ప్రధాన ఫీచర్లు:
* న్యూ జనరేషన్125సీసీ ఏటిఎఫ్‌టి ఇంజన్
* సరికొత్త డిజైన్‌తో కూడిన హెడ్‌ల్యాంప్
* డిజిటల్, అనాలాగ్ కలయికతో కూడిన కాంబో మీటర్ కన్సోల్
* స్టయిలిష్ స్ప్లిట్ సీట్
* డాజ్లింగ్ టెయిల్ ల్యాంప్
* రెండు రంగుల కలయికతో (బాడీ కలర్ ప్లస్ బ్లాక్) కూడిన సైడ్ మిర్రర్స్
* హెడ్‌లైట్ నుంచి ఇంజన్ వరకూ ఉండే క్లాసీ ఫ్రంట్ కౌల్ (ఫ్రండ్ బాడీ ప్యానెల్)
* సర్దుబాటు చేసుకునేందుకు వీలున్న వెనుక సస్పెన్షన్ (రియర్ షాక్అబ్జార్వర్స్)
* బాడీ కలర్‌లో ఉండే రియర్ గ్రిప్

హీరో ఇగ్నైటర్ ఫోటో గ్యాలరీ:

హీరో ఇగ్నైటర్ 125సీసీ బైక్ పెరల్ వైట్, స్పోర్ట్స్ రెడ్, వైబ్రాంట్ బ్లూ, పాంథర్ బ్లాక్ మెటాలిక్ అనే నాలుగు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది. ఇది 3 ఏళ్లు లేదా 4,000 కి.మీ. వారంటీతో పాటుగా ఆరు ఉచిత సర్వీసులతో (560 రోజుల ప్రయోజనార్థం) లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, August 17, 2012, 11:47 [IST]
English summary
The largest two-wheeler manufacturer in the country, Hero Motocorp has launched the Ignitor 125cc motorbike at a price of Rs 56,996 in Hyderabad. Hero Ignitor comes in 2 variants - the base variant with drum brakes, self start system and the top end variant with disc breaks which comes at Rs 59,031 (all prices ex-showroom Hyderabad).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+