హీరో హోండా సిబిజెడ్ ఎక్స్-ట్రీమ్, హంక్‌లలో కొత్త వెర్షన్లు

భారత ద్విచక్ర వాహన మార్కెట్లో తన లీడర్‌షిప్ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు గాను హీరో మోటోకార్ప్ సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే సరికొత్త మోడళ్లను, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మోడళ్లకు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌లను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ అందిస్తున్న హై-ఎండ్ మోటార్‌సైకిళ్లు సిబిజెడ్ ఎక్స్-ట్రీమ్, హంక్‌లలో రిఫ్రెష్డ్ వెర్షన్లను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

హీరో మోటోకార్ప్ కమ్యూటర్ బైక్ సెగ్మెంట్లో (100సీసీ) సక్సెస్ సాధించినంత ఎక్కువగా స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్లో సాధించలేకపోయింది. అయితే, ఇదే సెగ్మెంట్లో (స్పోర్ట్స్ బైక్) హీరో మోటోకార్ప్ సమీప పోటీదారు బజాజ్ ఆటో మాత్రం మంచి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. బజాజ్ ఆటో ప్రత్యేకించి స్పోర్ట్స్ బైక్ ప్రియులను దృష్టిలో ఉంచుకొని సరికొత్త డిజైన్, టెక్నాలజీ, ఇంజన్, పవర్, పెర్ఫామెన్స్‌, మైలేజ్‌ వంటి అంశాలతో కూడిన మోటార్‌సైకిళ్లను అందిస్తోంది.


ఈ నేపథ్యంలో, హీరో మోటోకార్ప్ స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్లో తామేంటో నిరూపించుకునేందుకు ఈ పాత మోటార్‌సైకిళ్లకు సరికొత్త హంగులను జోడించనుంది. కొత్తగా మార్కెట్లోకి రానున్న సిబిజెడ్ ఎక్స్-ట్రీమ్, హంక్ మోడళ్లలో డిజైన్ పరంగా కొద్దిపాటి మార్పులు ఉండనున్నాయి. ఈ రెండు మోటార్‌సైకిళ్లలో కూడా హోండా యునికార్న్‌ 150సీసీ బైక్‌లో ఉపయోగించిన 149.1సీసీ ఇంజన్‌నే ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8500 ఆర్‌పిఎమ్ వద్ద 14.4 పిఎస్‌ల శక్తిని, 6500 ఆర్‌పిఎమ్ వద్ద 12.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ సిబిజెడ్ ఎక్స్-ట్రీమ్, హంక్ మోడళ్లపై హోండా బ్రాండింగ్ తొలగిపోనుంది. ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న హీరో స్ప్లెండర్, ప్యాషన్ మోడళ్ల మాదిరిగానే ఇవి కూడా హీరో బ్రాండ్ నేమ్‌తో లభ్యం కానున్నాయి. సరికొత్త పెయింట్ జాబ్, ఆకర్షనీయమైన స్టిక్కర్స్‌తో ఇవి మార్కెట్లోకి రానున్నాయి. ఈ రెండు బైక్‌లలో కూడా ఎలక్ట్రిక్ స్టార్ట్ స్టాండర్డ్ ఫీచర్‌గా లభిస్తుండగా, వెనుక వైపు డిస్క్ బ్రేక్ మాత్రం ఆప్షనల్ ఫీచర్‌గా లభిస్తుంది.

కాగా.. ప్రస్తుతం మార్కెట్లో సిబిజెడ్ ఎక్స్-ట్రీమ్ ధర రూ.68,000 లుగా ఉండగా, హంక్ ధర రూ.62,000 లుగా ఉంది. ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ ధరలో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఈ కొత్త బైక్‌ల గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్ స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Sunday, July 22, 2012, 16:10 [IST]
English summary
India's largest two wheeler maker, Hero Motocorp is giving a facelift to its 150cc motorcycle line up. The models that are going under the scissors include the company's CBZ X-treme and Hunk motorbikes.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+