250సీసీ స్పోర్ట్స్ బైక్‌ను అభివృద్ధి చేస్తున్న హీరో-ఈబిఆర్

By Ravi

ప్రపంచపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ (అమ్మకాల సంఖ్య పరంగా) హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా) తమ జపాన్ భాగస్వామి హోండా మోటార్స్ నుంచి విడిపోయిన తర్వాత, సాంకేతిక భాగస్వామ్యం కోసం అమెరికాకు చెందిన ప్రముఖ మోటార్‌సైకిల్ కంపెనీ "ఎరిక్ బ్యూయెల్ రేసింగ్" (ఈబిఆర్)తో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. తాజా అప్‌డేట్ ప్రకారం ఇప్పుడు ఈ రెండు సంస్థలు కలిసి ఓ 250సీసీ స్పోర్ట్స్ బైక్‌ను అభివృద్ధి చేయనున్నాయి. 2014లో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో ఈ బైక్‌ను ప్రదర్శించనున్నారు.

సుపీరియర్ టెక్నాలజీతో ప్రపంచ శ్రేణి ఉత్పత్తులను వీలైన తక్కువ సమయంలోనే స్వతహాగా తయారు చేసి, ప్రపంచానికి తన్నా ఏంటో చాటాలనుకుంటోంది. ప్రస్తుతం హీరో మోటోకార్ప్ తక్కువ సామర్థ్యం కలిగి ఇంజన్లు ఎక్కువ సామర్థ్యం కలిగిన ఇంజన్ల వరకూ విభిన్న ఉత్పత్తులపై పరిశోధనలు చేస్తోంది. కంపెనీ అభివృద్ధి చేస్తున్న కొత్త ఫ్లాట్‌ఫామ్‌పై ముందుగా మార్కెట్లోకి రానున్న బైక్ మాత్రం 250సీసీ ఇంజన్‌తో కూడినదేనని హీరో మోటోకార్ప్‌ను ఉటంకిస్తూ.. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించింది.


గుర్గావ్, డెహ్రడూన్‌లలోని హీరో మోటో ఆర్ అండ్ డి కేంద్రాల నుంచి మంచి నైపుణ్యం కలిగిన యువకుల బృందాన్ని అమెరికాలోని విస్కాన్సిల్‌లో ఈస్ట్ ట్రోయ్ వద్ద ఉన్న ఈబిఆర్ రీసెర్చ్ సెంటర్‌కు హీరో మోటో పంపించింది. ఈ హైపవర్ 2500సీసీ బైక్‌ను హీరో మోటోకార్ప్, ఈబిఆర్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. ఇటు ఇండియన్ మార్కెట్‌తో అటు గ్లోబల్ మార్కెట్లకు అనువుగా ఉండేలా ఈ 250సీసీ స్పోర్ట్స్ బైక్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఈబిర్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభ డెవలప్‌మెంట్ పూర్తయిన తర్వాత, పూర్తి డెవలప్‌మెంట్‌ను మరియు తయారీని ఇండియాలోని హీరో ప్లాంటులోనే చేపట్టనున్నారు.

More from DriveSpark

Article Published On: Friday, November 23, 2012, 17:43 [IST]
English summary
World's largest two wheeler manufacturer Hero MotoCorp and its US based technology partner Erik Buell Racing (EBR) are developing their first all-new 250cc sports bike. This bike will be displayed at 2014 Auto Expo in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+