హీరో ఇగ్నైటర్ 125సీసీ బైక్‌ను విడుదల చేసిన హీరో మోటోకార్ప్
ప్రపంచపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా) గడచిన జనవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన 125సీసీ మోటార్‌సైకిల్ 'హీరో ఇగ్నైటర్'ను ఇప్పుడు మార్కెట్లో వాణిజ్యపరంగా అందిస్తోంది. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఈ బైక్‌ను హీరో మోటోకార్ప్ దేశీయ విపణిలోకి విడుదల చేసింది. ఇందులో ఉపయోగించిన 125సీసీ ఇంజన్ 8000 ఆర్‌పిఎమ్ వద్ద 11 బిహెచ్‌పిల శక్తిని, 5000 ఆర్‌పిఎమ్ వద్ద 11 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఒకప్పటి హీరో మోటోకార్ప్ జపాన్ భాగస్వామని హోండా అందిస్తున్న స్టన్నర్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని ఈ కొత్త ఇగ్నైటర్ బైక్‌ను తయారు చేయటం జరిగింది. కాగా.. హీరో హోండా, హీరో మోటోకార్ప్‌గా పేరు మారిన తర్వాత, హీరో స్వంత బ్రాండింగ్‌తో మార్కెట్లో వస్తున్న మూడవ ఉత్పత్తి హీరో ఇగ్నైటర్ కావటం విశేషం. ఇప్పటికే హీరో బ్రాండ్ పేరిట హీరో ఇంపల్స్ 150సీసీ ఆన్-రోడ్/ఆఫ్-రోడ్ మోటార్‌సైకిల్‌ను, మ్యాస్ట్రో 110సీసీ స్కూటర్‌ను కంపెనీ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
హీరో ఇగ్నైటర్ 125సీసీ బైక్ ఫీచర్లు:
* శక్తివంతమైన న్యూ జనరేషన్ 125సీసీ ఏటిఎఫ్‌టి ఇంజన్
* మంచి కాంతివంతమైన, ఆకర్షనీయమైన డిజైన్ కలిగిన (స్ట్రైకింగ్ ట్రపేజోడియల్) హెడ్‌లైట్
* డిజిటల్-అనలాగ్ కాంబో మీటర్ కన్సోల్
* స్టయిలిష్ స్ప్లిట్ (రెండుగా విడిపోయి ఉండే) సీట్
* డాజ్లింగ్ టెయిల్ లైట్ (బ్రేక్ లైట్)
* డ్యూయెల్ టోన్ (రెండు రంగులతో కూడిన) రియర్ వ్యూ మిర్రర్
* క్లాసీ లుక్ కలిగిన బైక్ ముంద భాగం (ఫ్రంట్ కౌల్)
* అడ్జస్టబల్ రియర్ షాక్ అబ్జార్వర్స్
* బైక్ బాడీ కలర్‌లోనే ఉండే రియర్ గ్రిప్ (గ్రాబ్ రెయిల్)
హీరో ఇగ్నైటర్ బైక్ రెండు వేరియంట్లలో (డ్రమ్ బ్రేక్ + సెల్ఫ్ స్టార్ట్, డిస్క్ బ్రేక్ + సెల్ఫ్ స్టార్ట్) లభిస్తుంది. డ్రమ్ బ్రేక్, సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్ ధర రూ. 55,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండగా, డిస్క్ బ్రేక్, సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్ ధర రూ. 57,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. హీరో ఇగ్నైటర్ 125సీసీ మోటార్‌సైకిల్ నాలుగు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యం కానుంది. ఇది 3 ఏళ్లు లేదా 4,000 కి.మీ. వారంటీతో పాటుగా ఆరు ఉచిత సర్వీసులతో (560 రోజుల ప్రయోజనార్థం) లభిస్తుంది.


Click it and Unblock the Notifications








