హీరో మోటోకార్ప్-ఎరిక్ బ్యూయెల్ నుండి సూపర్‌బైక్
ఈబిఆర్‌తో తమకు సౌకర్యమైన ఒప్పందం ఉందని, అది ఈక్విటీ పార్ట్‌నర్‌షిప్‌గా అభివృద్ధి చెందుతుందని హీరో మోటోకార్ప్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పవన్ ముంజాల్ అన్నారు. ఒకప్పుడు హ్యార్లీ డేవిడ్‌సన్ బ్రాండ్‌తో కలిసి పనిచేసిన ఎరిక్ బ్యూయెల్ రేసింగ్ నుండి నిరంతరాయ సాంకేతిక మద్దతును పొందాలనే ఉద్దేశ్యంతో హీరో మోటోకార్ప్ ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే, ఎంత మొత్తం వెచ్చించి ఈ వాటాలను కొనుగోలు చేసే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. జపాన్ భాగస్వామి హోండా ఉన్న 27 ఏళ్ల బంధాన్ని తెంచుకున్న తర్వాత హీరో మోటోకార్ప్‌కు కటింగ్-ఎడ్జ్ టెక్నాలజీలో సరైన భాగస్వామి లభించకపోయినట్లయితే, దేశీయ విపణిలో నాయకత్వాన్ని స్థానాన్ని కొనసాగించడం కష్టమని నిపుణులు భావించారు. దీంతో గడచిన వారం అమెరికన్ కంపెనీ ఎరిక్ బ్యూయెల్ రేసింగ్‌తో హీరో మోటోకార్ప్ ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నట్లు ప్రకటించింది.


Click it and Unblock the Notifications









