హీరో మోటోకార్ప్-ఎరిక్ బ్యూయెల్‌ నుండి సూపర్‌బైక్

హీరో హోండా జాయింట్ వెంచర్ నుండి విడిపోయిన తర్వాత సాంకేతిక భాగస్వామి కోసం ఊరూరు గాలించి చివరకు అమెరికాకు చెందిన మోటార్‌సైకిల్ కంపెనీ "ఎరిక్ బ్యూయెల్ రేసింగ్" (ఈబిఆర్)తో చేతులు కలిపిన హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా) ఇప్పుడు ఓ సూపర్‌బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. 2013 నాటికి హీరో సూపర్‌బైక్ రోడ్లపైకి రానుంది.

రేస్ బైక్‌లకు ప్రాచుర్యం పొందిన ఎరిక్ బ్యూయెల్ రేసింగ్ కంపెనీ, ప్రపంచపు అగ్రగామి ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్‌ల నుండి రానున్న సూపర్‌బైక్‌పై ఇప్పుడు బైక్ లవర్స్ దృష్టంతా కేంద్రీకృతమై ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మంచి మార్కెట్ కలిగిన సూపర్ బైక్స్ సెగ్మెంట్‌ను తాము ఇన్నాళ్లు మిస్ అయ్యామని, ఇకపై ఈ సెగ్మెంట్లో కూడా తమ సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పేందుకు సిద్ధమవుతున్నామని హీరో మోటోకార్ప్ ఎమ్‌డి, సీఈఓ పవన్ ముంజాల్ తెలిపారు.

అంతర్జాతీయ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉన్నట్లయితే, ఇండియాలో హై-ఎండ్ ఇంజన్లను కూడా ఉత్పత్తి చేస్తామని, అలాగే విదేశీ మార్కెట్లలో కూడా వీటిని ఉత్పత్తి చేస్తామని ఆయన చెప్పారు. హీరో మోటోకార్ప్ ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో విడుదల చేసిన హైబ్రిడ్ స్కూటర్ లీప్‌ను ఈబిఆర్‌తో కలిసి అభివృద్ధి చేసింది. ఈబిఆర్‌తో హీరో మోటోకార్ప్‌కు కుదిరిన ఒప్పందం ప్రకారం, హీరో మోటోకార్ప్ అందిచే భవిష్యత్తులో మార్కెట్లోకి తీసుకురానున్న మోడళ్లకు కావల్సిన కటింగ్-ఎడ్జ్ టెక్నాలజీ, డిజైన్ నుండి డెవలప్‌మెంట్ సేవలను ఎరిక్ బ్యూయెల్ రేసింగ్ అందించనుంది.

More from DriveSpark

Article Published On: Friday, February 24, 2012, 19:20 [IST]
English summary
Hero MotoCorp, India's largest two wheeler manufacturer has announced a partnership with American motorcycle maker Erik Buell Racing. Pawan Munjal, MD and CEO of Hero MotoCorp, said, “We are going for an area (super bikes) where we are completely missing, for which there is a large market across the globe. We will also be manufacturing high-end engines in India and if there is demand abroad, we would manufacture them there as well.”
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+