ఎరిక్ బ్యూయెల్‌ను పార్టనర్‌గా ఎంచుకున్న హీరో మోటోకార్ప్
అమెరికాకు చెందిన మోటార్‌సైకిల్ కంపెనీ "ఎరిక్ బ్యూయెల్ రేసింగ్" (ఈబిఆర్)తో జతకట్టినట్లు హీరో మోటోకార్ప్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈబిఆర్‌తో భాగస్వామ్యంలో భాగంగా, హీరో మోటోకార్ప్ అందిచే భవిష్యత్ (ఫ్యూచర్) మోడల్స్ కోసం కటింగ్-ఎడ్జ్ టెక్నాలజీ, డిజైన్ నుండి డెవలప్‌మెంట్ వరకూ అన్ని రకాల సాంకేతిక మద్ధతును ఈబిఆర్ అందించనుంది.
హోండా కంపెనీతో హీరోకు ఉన్న కొత్త లైసెన్సు ఒప్పందం ప్రకారం 2014వ సంవత్సరం వరకూ హోండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే అవకాశం హీరో మోటోకార్ప్‌కు ఉంది. అయితే, వీలైనంత త్వరగా ఓ సాంకేతిక భాగస్వామిని ఎంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఎరిక్ బ్యూయెల్ రేసింగ్ కంపెనీతో హీరో మోటోకార్ప్ ఈ భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గడచిన మార్చిలో హోండాతో ఉన్న 26-ఏళ్ల బంధాన్ని హీరో మోటోకార్ప్ తెంచుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications
