క్యూ3లో 43 శాతం పెరిగిన హీరో మోటోకార్ప్ నికర లాభం

గడచిన ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలనికి కంపెనీ నికర లాభం రూ.429 కోట్లుగా ఉన్నట్లు హీరో మోటోకార్ప్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక కంపెనీ టర్నోవర్ విషయానికి వస్తే.. అక్టోబర్-డిసెంబర్ 2011 మధ్య కాలానికి గానూ మొత్తం 6,031 కోట్లను ఆర్జించామని కంపెనీ తెలిపింది. హీరో మోటోకార్ప్ చరిత్రలోనే ఇది అత్యధిక టర్నోవర్. టర్నోవర్‌లో కంపెనీ 16.85 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది.
ఈ సమయంలో హీరో మోటోకార్ప్ మొత్తం 15,89,286 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. కంపెనీ మొత్తం ఆదాయం రూ. 5223.69 కోట్ల నుంచి రూ.6107.73 కోట్లకు పెరిగింది. జపాన్ భాగస్వామి హోండా నుండి విడిపోయినప్పటికీ, హీరో మోటోకార్ప్ మాత్రం, ప్రతి నెలా ఐదు లక్షలకు పైగా వాహనాలను విక్రయిస్తూ ప్రోత్సాహకర వృద్ధిని తన ఖాతాలో నమోదు చేసుకుంటూ వస్తోంది. రానున్న (2012) ఆర్థిక సంవత్సరంలో 60 లక్షలకు పైగా వాహనాలను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా నిర్ధేశించుకుంది.


Click it and Unblock the Notifications








