లాభాల బాటలో హీరో మోటోకార్ప్, ఇగ్నైటర్ విడుదల
దేశపు ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ 30తో ముగిసిన మొదటి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను నమోదు చేసుకుంది. ఈ సమయంలో కంపెనీ నికర లాభం 10.31 శాతం వృద్ధిని సాధించి రూ.615.46 కోట్లుగా నమోదైంది. గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ నికర లాభం రూ.557.89 కోట్లుగా ఉన్నట్లు హీరో మోటోకార్ప్ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ మొదటి త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ ద్వారా వచ్చిన ఆదాయం రూ.6,207.78 కోట్లుగా నమోదు కాగా, ఇది వరకటి సంవత్సరంలో ఇదే కాలానికి నిర్వహణ ఆదాయం రూ.5,637.64 కోట్లుగా ఉంది. ఈ సమయంలో కంపెనీ ఏకీకృత అమ్మకాలు 16,42,292 యూనిట్లు పెరిగాయి.
హీరో ఇగ్నైటర్ విడుదల:
గడచి జనవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో హీరో మోటోకార్ప్ విడుదల చేసిన హీరో ఇగ్నైటర్ 125సీసీ మోటార్‌సైకిల్‌ను కంపెనీ తాజాగా కర్ణాటక మార్కెట్లో విడుదల చేసింది. కర్ణాటక మార్కెట్లో హీరో ఇగ్నైటర్ ప్రారంభ ధర రూ.56,747 (ఎక్స్-షోరూమ్, బెంగుళూరు) లుగా ఉంది. హీరో ఇగ్నైటర్‌లో హోండా సిబిఎఫ్ స్టన్నర్‌లో ఉపయోగించిన 124.77సీసీ ఏటిఎఫ్‌టి సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఇది గరిష్టంగా 11 బిహెచ్‌పిల శక్తిని, 11 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హీరో ఇగ్నైటర్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.
హీరో ఇగ్నైటర్ బైక్ రెండు వేరియంట్లలో (డ్రమ్ బ్రేక్ + సెల్ఫ్ స్టార్ట్, డిస్క్ బ్రేక్ + సెల్ఫ్ స్టార్ట్) నాలుగు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యం కానుంది. ఇది 3 ఏళ్లు లేదా 4,000 కి.మీ. వారంటీతో పాటుగా ఆరు ఉచిత సర్వీసులతో (560 రోజులు) లభిస్తుంది.
హీరో ఇగ్నైటర్ 125సీసీ బైక్ ఫీచర్లు:
* శక్తివంతమైన న్యూ జనరేషన్ 125సీసీ ఏటిఎఫ్‌టి ఇంజన్
* మంచి కాంతివంతమైన, ఆకర్షనీయమైన డిజైన్ కలిగిన (స్ట్రైకింగ్ ట్రపేజోడియల్) హెడ్‌లైట్
* డిజిటల్-అనలాగ్ కాంబో మీటర్ కన్సోల్
* స్టయిలిష్ స్ప్లిట్ (రెండుగా విడిపోయి ఉండే) సీట్
* డాజ్లింగ్ టెయిల్ లైట్ (బ్రేక్ లైట్)
* డ్యూయెల్ టోన్ (రెండు రంగులతో కూడిన) రియర్ వ్యూ మిర్రర్
* క్లాసీ లుక్ కలిగిన బైక్ ముంద భాగం (ఫ్రంట్ కౌల్)
* అడ్జస్టబల్ రియర్ షాక్ అబ్జార్వర్స్
* బైక్ బాడీ కలర్‌లోనే ఉండే రియర్ గ్రిప్ (గ్రాబ్ రెయిల్)


Click it and Unblock the Notifications








