ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనున్న హీరో మోటోకార్ప్
అమ్మకాల పరంగా ప్రపంచపు అగ్రగామిగా ఉన్న ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా) మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తులను వేగంగా అందించేందుకు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనున్నట్లు ప్రకటించింది.
ప్రస్తుతం సాలీనా 6.2 మిలియన్లుగా ఉన్న ద్విచక్ర వాహనాల ఉత్పత్తిని రానున్న మార్చి నెలాఖరు నాటికి 7 మిలియన్లుకు పెంచున్నామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
దీని గురించి కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) అనీల్ దువా మాట్లాడుతూ.. ఉత్తరాఖాండ్ రాష్ట్రంలోని హరిద్వార్ ప్లాంటులో ప్రస్తుతం రోజుకు 8,000 యూనిట్లుగా ఉత్పత్తిని 9,000 యూనిట్లకు పెంచనున్నామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశంలో ద్విచక్ర వాహనాల అమ్మకాల వృద్ధి 11 శాతం 13 శాతం మధ్యలో నమోదు కాగలదని కంపెనీ అంచనా వేస్తుందని అన్నారు.
కాగా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31, 2011తో ముగిసిన మూడవ త్రైమాసికంలో హీరో మోటోకార్ప్ నికర లాభం 42.89 శాతం వృద్ధిని సాధించి రూ.613.03 కోట్లుగా నమోదయ్యి.గడచిన ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలనికి కంపెనీ నికర లాభం రూ.429 కోట్లుగా ఉన్నట్లు హీరో మోటోకార్ప్ ఓ ప్రకటనలో పేర్కొంది.


Click it and Unblock the Notifications








