మే 2012లో 11 శాతం పెరిగిన హీరో మోటోకార్ప్ అమ్మకాలు

వరల్డ్ నెంబర్ వన్ టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్‌ (గతంలో హీరో హోండా) గడచిన నెలలో అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసుకుంది. మే 2012లో హీరో మోటోకార్ప్ మొత్తం 5,56,644 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించి, గతేడాది ఇదే నెలతో పోల్చుకుంటే 11.28 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. మే 2011లో హీరో మోటోకార్ప్ అమ్మకాలు 5,00,234 యూనిట్లుగా ఉన్నాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

గడచిన ఏప్రిల్ 2012 నెలలో సాధించిన అత్యధిక నెలవారీ రికార్డును మే 2012 నెల అమ్మకాలు బ్రేక్ చేశాయిన కంపెనీ తెలిపింది. నెల తర్వాత నెల తాము ఓ కొత్త ఇండస్ట్రీ బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తున్నమని, ఇది తమ వృద్ధిలో ప్రగతికి సూచకం మాత్రమే కాదని, తమ విలువైన కస్టమర్లు తమపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనమకి హీరో మోటోకార్ప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) అనీలు దువా వెల్లడించారు.

ఓ వైపు పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్న ద్విచక్ర వాహన అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఇందుకు ప్రధానం, పెరిగిన పెట్రోల్ ధరలను చూసి భయపడుతున్న కార్ల యజమానులు చిన్న చిన్న అవసరాలు, తమ రోజూవారీ ప్రయాణాలకు కార్లను ఉపయోగించడానికి బదులు టూవీలర్‌ను ఉపయోగించడమే ఉత్తమమని భావిస్తుండటమే. దీంతో కొత్తగా కార్లు కొనాలనేకునే వారు, ఇప్పటికే కార్లను కలిగి ఉన్న వారు టూవీలర్ వైపు మొగ్గు చూపుతున్నారు.

జపాన్ భాగస్వామి హోండా నుండి విడిపోయిన తర్వా హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్లో ఆచితూచి అడుగులు వేస్తుంది. ఏప్రిల్ నెలతో ప్రారంభమైన కొత్త ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు నెలల్లో అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసుకోవటంతో కొత్త ఆర్థిక సంవత్సరాన్ని చాలా గొప్పగా ప్రారంభించినట్లయిందని అనీల్ దువా అన్నారు.

More from DriveSpark

Article Published On: Saturday, June 2, 2012, 14:59 [IST]
English summary
The country's largest two-wheeler maker Hero MotoCorp reported its highest ever monthly sales at 5,56,644 units in May, registering a growth of 11.28 per cent. The company had sold 5,00,234 units in May 2011, Hero MotoCorp said in a statement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+