ఒక్క రోజులో ఒక్క లక్ష 'హీరో' ద్విచక్ర వాహనాల అమ్మకం

By Ravi

దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ మరో అరుదైన రికార్డును తన ఖాతోలో వేసుకుంది. ప్రతినెలా సుమారు ఐధు లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలను విక్రయించే హీరో మోటోకార్ప్ కేవలం ఒక్క రోజులోనే లక్షకు పైగా ద్విచక్ర వాహనాలను విక్రయించింది. గత ఆదివారం ధన్‌తేరస్ (ధనత్రయోశది) రోజున లక్షకు పైగా టూవీలర్లను విక్రయించామని హీరో మోటోకార్ప్ ఓ ప్రకటనలో పేర్కొంది. పండుగ సీజన్‌లో కొనుగోళ్ల సెంటిమెంట్ బలంగా ఉండటంతో అమ్మకాలు జోరందుకున్నాయని కంపెనీ తెలిపింది.

ఈ మొత్తం అమ్మకాల్లో ఒక్క స్ప్లెండర్ వాహనాలే 40,000ల యూనిట్ల వరకూ అమ్ముడయ్యాయని, మిగిలిన 60,000 యూనిట్లలో ప్లెజర్ స్కూటర్‌, ప్యాషన్‌, ఇగ్నైటర్‌ తదితర ఇతర ద్విచక్ర వాహనాలు ఉన్నాయని హీరో మోటార్‌ కార్పొరేషన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అనిల్‌ దువా చెప్పారు. గత నెలలో మొత్తం 1.8 లక్షలు స్ప్లెండర్ బైక్‌లు అమ్ముడయ్యాయని, ఈ ఏడాది ఏప్రిల్-అక్టోబర్ కాలానికి విక్రయాలు 14 లక్షలకు చేరాయని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమకు అత్యంత ప్రముఖమైన బ్రాండ్‌ హీరో ప్యాషన్‌ మోడల్‌ బైక్‌లను ఇప్పటి వరకూ 8 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేశామని అనిల్‌ దువా తెలిపారు.


కాగా.. కంపెనీ ఇటీవలే 110 సీసీ విభాగంలో సరికొత్త హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో మోటార్‌సైకిల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కేవలం రూ. 46,800 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరకే హీరో మోటోకార్ప్ ఈ బైక్‌ను విక్రయిస్తోంది. ఇందులో అమర్చిన 109.1సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సి ఇంజన్‌ గరిష్టంగా 8.7 పిఎస్‌ల శక్తిని, 9.36 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. టాప్-ఎండ్ వేరియంట్‌ హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో 110సీసీ బైక్ డిస్క్ బ్రేక్స్, సెల్ఫ్ స్టార్ట్, అల్లాయ్ వీల్స్ ఆప్షన్‌తో లభిస్తుంది.

హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో 8 ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యమవుతుంది. ప్రారంభంలో భాగంగా ప్యాషన్ ఎక్స్‌ప్రో ఎంపిక చేసిన మార్కెట్లలో లభ్యం కానుంది. అనంతరం దీనిని దశల వారీగా, దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో 110సీసీ బైక్ ఈ సెగ్మెంట్లోని సుజుకి హయాటే, హోండా డ్రీమ్ యుగ వంటి మోటార్‌సైకిళ్లకు పోటీగా నిలువనుంది. ఇది మొత్తం ఐదు వేరియంట్లలో లభ్యమవుతుంది. వీటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

  • హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో (డ్రమ్ బ్రేక్స్, కిక్ స్టార్ట్, స్పోక్ వీల్స్) - రూ. 46,800
  • హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో (డ్రమ్ బ్రేక్స్, కిక్ స్టార్ట్, అల్లాయ్ వీల్స్) - రూ. 47,800
  • హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో (డ్రమ్ బ్రేక్స్, సెల్ఫ్ స్టార్ట్, స్పోక్ వీల్స్) - రూ. 48,800
  • హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో (డ్రమ్ బ్రేక్స్, సెల్ఫ్ స్టార్ట్, అల్లాయ్ వీల్స్) - రూ. 49,800
  • హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో (డిస్క్ బ్రేక్స్, సెల్ఫ్ స్టార్ట్, అల్లాయ్ వీల్స్) - రూ. 51,800

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Wednesday, November 14, 2012, 11:08 [IST]
English summary
Hero MotoCorp Ltd (HMCL) on Monday said the company sold over one lakh units of two-wheelers on the Dhanteras festival on Sunday. It sold over 40,000 units of Splendor alone and rest of the numbers came from Passion, Maestro and Pleasure (scooters), Ignitor, Hunk and Xtreme.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+