అగ్రస్థానంపై కన్నేసిన హోండా; ససేమిరా అంటోన్న హీరో

జపనీస్ టూవీలర్ కంపెనీ హీరో హోండా జాయింట్ వెంచర్ నుండి వేరుపడిన తర్వాత భారత వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇదివరకు భారత ద్విచక్ర వాహన మార్కెట్లో నాలుగో స్థానంలో ఉన్న హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) ఇటీవలే చెన్నైకు చెందిన ద్విచక్ర వాహన కంపెనీ టీవీఎస్‌ మోటార్ కంపెనీను ఓవర్‌టేక్ చేసి మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పుడు ఏకంగా ద్విచక్ర వాహన మార్కెట్లో ఉన్న అగ్రగామి కంపెనీ హీరో మోటోకార్ప్ స్థానంపై హోండా కన్ను పడింది.

సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టడంతో పాటుగా, మెరుగైన వినియోగదారులను సేవలను అందించడం ద్వారా భారత్‌లో హోండా తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో హీరో మోటోకార్ప్ తన స్థానానికి ముప్పు వాటిళ్లకుండా ఉండేదుకు ఇప్పటి నుండే ముందు జాగ్రత్తలు తీసుకునే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే హీరో మోటోకార్ప్ ఇటీవలే అమెరికాకు చెందిన ఎరిక్ బ్యూయెల్ మోటార్‌సైకిల్ కంపెనీతో చేతులు కలిపి తన సాంకేతిక భాగస్వామిగా ఎంచుకున్న సంగతి తెలిసిందే.

అయితే, తాజాగా.. హీరో మోటోకార్ప్ గుజరాత్ రాష్ట్రంలో మరో ప్లాంటును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. భారత్‌లో ఇది హోండాకు నాల్గవ ప్లాంటు కానుంది. అలాగే, కర్ణాటకలో కూడా తమ ఐదవ ప్లాంటును ఏర్పాటే చేసే విషయంపై హీరో మోటోకార్ప్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 2020 సంవత్సరం నాటికి 100 కోట్ల డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకునేందుకు హోండా తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని వీలైనంత వేగంగా పెచుకోవాలని చూస్తోంది. గుజరాత్‌లో ప్లాంటు ఏర్పాటు కోసం హీరో మోటోకార్ప్ సుమారు రూ.1200 కోట్లు వెచ్చిస్తున్నట్లు సమాచారం.

గుజరాత్‌లో ఉన్న ముంద్రా పోర్ట్ ఎగుమతులకు అనుకూలంగా ఉండటంతో ఇప్పటికే పలు ఆటోమొబైల్ కంపెనీలు ఆ రాష్ట్రంలో వచ్చి వాలుతున్నాయి. ఈ రాష్ట్రంలో ప్లాంటు ఏర్పాటు డీల్ దాదాపుగా పూర్తయిందని, హలోల్‌లో ఉన్న జనరల్ మోటార్స్ ప్లాంటుకు సమీపంలో 300 ఎకరాల స్థలాన్ని హీరో మోటోకార్ప్ పరిశీలిస్తుందని తెలుస్తోంది. ఈ ప్లాంటు ఏర్పాటుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈనెలలో వెల్లడిస్తామని హీరో మోటోకార్ప్ ఎమ్‌డి పవన్ ముంజాల్ ఓ పత్రికతో తెలిపారు. ఏదేమైనప్పటికీ.. దినదినాభివృద్ధి చెందుతున్న హోండాను చూసి, టూవీలర్ మార్కెట్‌లో హీరో పరుగులు పెడుతున్నట్లు తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, March 8, 2012, 17:56 [IST]
English summary
India's largest two-wheeler maker Hero MotoCorp is planning to set up its upcoming plant in Gujarat. Company is expected make an announcement in march regarding the new plant.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+