రాజస్థాన్‌లో హీరో మోటోకార్ప్ ఆర్ అండ్ డి ప్లాంట్ ఏర్పాటు
దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్, భారత ద్విచక్ర వాహన మార్కెట్లో తన మరింత పటిష్టం చేసుకునేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం తమకు కావలసిన సాంకేతిక పరిజ్ఞానం కోసం జపాన్ కంపెనీ హోండాపై ఆధారపడుతూ వస్తున్న హీరో మోటోకార్ప్, ఇకపై తమ స్వంత టెక్నాలజీని తామే అభివృద్ధి చేసుకోవాలని భావిస్తోంది.
ఇందులో భాగంగానే రాజస్థాన్‌లో ఓ అత్యాధునిక పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ అండ్ డి) కేంద్రా ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది. జైపూర్‌లోని కుకాస్ ప్రాంతంలో సుమారు 250 ఎకరలా విస్తీర్ణంలో హీరో మోటోకార్ప్ ఈ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. హీరో మోటోకార్ప్ అందిస్తున్న 125సీసీ మోటార్‌సైకిల్‌ను చెన్నై మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా కంపెనీ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు.
చెన్నై మార్కెట్లో హీరో ఇగ్నైటర్ బేస్ వేరియంట్ ధర రూ.56,996 (ఎక్స్-షోరూమ్, చెన్నై), టాప్ వేరియంట్ ధర రూ.59,031 (ఎక్స్-షోరూమ్, చెన్నై)గా ఉంది. హీరో మోటోకార్ప్ ఇటీవలే హీరో బ్యాడ్జ్‌తో కూడిన 150సీసీ ఆన్-రోడ్, ఆఫ్-రోడ్ మోటార్‌సైకిల్ ఇంపల్స్ మరియు 110సీసీ స్కూటర్ మ్యాస్ట్రోలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 125సీసీ సెగ్మెంట్లో హీరో మోటోకార్ప్ సూపర్ స్ప్లెండర్, గ్లామర్ మోడళ్లను అందిస్తుంది.
కంపెనీ తాజాగా ప్రవేశపెట్టిన హీరో ఇగ్నైటర్‌లో ఏటిఎఫ్‌టి టెక్నాలజీతో కూడిన 125సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 8000 ఆర్‌పిఎమ్ వద్ద 11 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త బైక్‌లో డిజిటల్, అనలాగ్ కలయికతో కూడిన కాంబో మీటర్ కన్సోల్, స్టయిలిష్ ఫ్రంట్ కౌల్, సర్దుబాటు చేసుకునే వీలున్న వెనుక షాక్ అబ్జార్వర్స్ వంటి విశిష్టమైన ఫీచర్లు ఉన్నాయి. ఇది పెరల్ వైట్, స్పోర్ట్స్ రెడ్, వైబ్రాంట్ బ్లూ, పాంథర్ బ్లాక్, బ్లాక్ మెటాలిక్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








