భారత్‌కు ఎడిషన్ హోటల్ బ్రాండ్‌ను తీసుకురానున్న హీరో

ఇందులో భాగంగా న్యూయార్క్ లిస్టెడ్ కంపెనీ అయిన మారియట్ ఇంటర్నేషనల్‌లో హీరో మోటోకార్ప్ చర్చలు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఎడిషన్ హోటల్ బ్రాండ్ సృష్టికర్త, బొటీక్ హోటల్స్ గాడ్‌ఫాదర్‌గా పిలువబడే ఇయాన్ షరాజర్ గడచిన వారంలో భారత్‌కు విచ్చేసినప్పుడు, ఆయనను ముంజాల్ సభ్యులు ప్రత్యేకంగా ఆహ్వానించి చర్చలు జరిపినట్లు సమాచారం.
ఇటీవల గుర్గావ్‌లో హీరో గ్రూప్ కొనుగోలు చేసిన స్థలాలను షరాజర్ పరిశీలించారని, భారత్‌లో ఎడిషన్ ప్రారభించాలనుకుంటున్నామని అన్నారని, ఇందుకు ముంజాల్ కుటుంబం కూడా సంతోషంగానే అంగీకరించిందని హీరో గ్రూప్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే, ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనలు వెలువడలేదు. దీనిపై స్పందించేందుకు హీరో గ్రూప్ అధికారులు నిరాకరిస్తున్నారు.


Click it and Unblock the Notifications








