ఆటో ఎక్స్‌పోలో రిఫ్రెష్డ్ షైన్‌ను ఆవిష్కరించిన హోండా

Honda CB Shine
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ నుండి 125సీసీ బైక్ సెగ్మెంట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న "హోండా సిబి షైన్"లో సరికొత్త వేరియంట్లను కంపెనీ పరిచయం చేసింది. ఇటీవలే ముగిసిన 2012 ఆటో ఎక్స్‌పోలో సరికొత్త కలర్ ఆప్షన్లతో కూడిన రిఫ్రెష్డ్ హోండా సిబి షైన్‌ను కంపెనీ విడుదల చేసింది. త్వరలోనే ఈ మోడళ్లు మార్కెట్లోకి లభ్యం కానున్నాయి.

తొలిసారిగా భారత మార్కెట్లో హోండా సిబి షైన్‌ను 2006వ సంవత్సరంలో కంపెనీ విడుదల చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ కూడా ఈ మోడల్ హోండాకు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది. కాగా.. ప్రస్తుతం ఫోర్స్ సిల్వర్ మెటాలిక్, మాన్‌సూన్ గ్రే మెటాలిక్ అనే రెండు ఆకర్షనీయమైన రంగుల్లో కొత్త సిబి షైన్‌ను కంపెనీ విడుదల చేసింది. కొత్త షైన్ ఫ్యూయెల్ ట్యాంక్‌పై సరికొత్త బాడీ గ్రాఫిక్స్ ప్రధాన ఆకర్షనగా నిలువనున్నాయి.

ప్రస్తుతం హోండా షైన్‌లో లభిస్తున్న బ్లాగ్, జెనీ గ్రే మెటాలిక్, రెబల్ రెడ్ మెటాలిక్ రంగులు యధావిధిగా కొనసాగనున్నాయి. హోండా సిబి షైన్‌లో ఉపయోగించిన 125సీసీ ఆప్టిమ్యాక్స్ ఇంజన్ 10.3 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని డెలివరీ చేస్తుంది. ఈ ఇంజన్‌లో ఉపయోగించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఇది తక్కువ ఆర్‌పిఎమ్ వద్ద ఎక్కువ టార్క్‌ను విడుదల చేస్తుంది.

ఈ ఇంజన్ స్మూత్ రైడ్ అనుభూతిని కల్పిస్తుంది. ఇందులో అమర్చిన ఆప్షనల్ డిస్క్ బ్రేక్ మంచి బ్రేకింగ్ కాన్ఫిడెన్స్‌ను కలిగిస్తుంది. ఇంకా ఇందులో మెయింటినెన్స్ ఫ్రీ బ్యాటరీ, విస్కౌస్ ఎయిర్ ఫిల్టర్, టఫ్ప్-అప్ ట్యూబ్స్ వంటి విశిష్టమైన ఫీచర్లు ఉన్నాయి. సిబి షైన్‌లో అమర్చిన 3-స్టెప్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ఎలాంటి రోడ్లపై అయినా సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని కల్పిస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, January 14, 2012, 13:12 [IST]
English summary
Honda Motorcycles and Scooter India Ltd has unveiled the refreshed CB Shine at recently concluded 11the edition Delhi Auto Expo 2012. CB Shine now comes in 2 new colours - Force Silver Metallic and Monsoon Grey Metallic.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+