మార్చి నెలలో మార్కెట్లోకి రానున్న హోండా సిబిఆర్ 150ఆర్
నిజమైన రేసింగ్ అనుభూతి (ట్రూ రేసింగ్ సెన్సేషన్) స్ఫూర్తితో రూపొందించిన ఈ సరికొత్త హోండా సిబిఆర్ 150ఆర్‌లో సరికొత్త డిజైన్, ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్, 150సీసీ లిక్విడ్ కూల్డ్, డిఓహెచ్‌సి పిజిఎమ్-ఎఫ్ఐ ఇంజన్ వంటి విశిష్టమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఇంజన్ 10,500 ఆర్‌పిఎమ్ వద్ద 18 బిహెచ్‌పిల శక్తిని, 7500 ఆర్‌పిఎమ్ వద్ద 12.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.
హోండా సిబిఆర్ 150ఆర్ నిర్మాణంలో ట్విన్ ట్యూబ్లర్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు. ఇది కూడా సిబిఆర్ 250ఆర్ మాదిరిగానే వెనుకవైపు మోనో సస్పెన్షన్ (సింగిల్ షాక్ అబ్జార్వర్)ను కలిగి ఉంటుంది. అయితే, ఇందులో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) లేదు. ఏబిఎస్ స్థానంలో ముందు వెనుక వైపు డిస్క్ బ్రేక్‌లను ఉపయోగించారు. అలాగే ముందు, వెనుక విశాలమైన ట్యూబ్‌లెస్ టైర్లను అమర్చారు.
హోండా సిబిఆర్ 150ఆర్‌లో ఉపయోగించిన అడ్వాన్స్ ఓ2 సెన్సార్, ఎయిర్ ఇండక్టర్‌లు తక్కువ కర్బన ఉద్ఘారాలను వెలువడేలా చేస్తాయి. ఇది స్టాండర్డ్, డీలక్స్ అనే రెండు వేరియంట్లలో, రెండు రంగులలో లభ్యం కానుంది. ఇక దీని ధర విషయానికి వస్తే, ఇది రూ.1.2 లక్షలకు దిగువన ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications









