సిబిఆర్ 250ఆర్‌కు ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది అవార్డ్

అంతేకాకుండా గడచిన సంవత్సరంలో భారతదేశంలో అత్యధికంగా వివిధ ఆటోమొబైల్ అవార్డులను సొంతం చేసుకున్న బైక్‌గా కూడా హోండా సిబిఆర్ 250ఆర్ నిలిచింది. బజాజ్ బాక్సర్ బిఎమ్15, హీరో ఇంపల్స్, హ్యార్లీ డేవిడ్‌సన్ ఐరన్, కవాసకి నిన్జా 650ఆర్, హ్యోసంగ్ జిటి 650ఎన్ వంటి హేమాహేమీల బైక్‌లు ఈ అవార్డు కోసం పోటీపడగా, హోండా సిబిఆర్ 250ఆర్ ఈ అవార్డును దక్కించుకుంది. హోండా కంపెనీకు వరుసగా ఈ అవార్డు రావడం ఇది రెండవసారి.
గడచిన సంవత్సరంలో హోండా సిబి ట్విస్టర్ ఈ అవార్డును సొంతం చేసుకుంది. సిబిఆర్ 250ఆర్ గ్లోబల్ స్పోర్ట్స్ బైక్‌ను హోండా తొలిసారిగా మార్చి 2011లో భారత మార్కెట్లో విడుదల చేసి 250సీసీ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. హోండా సిబిఆర్ 250ఆర్‌లో కొత్తగా అభివృద్ధి చేసిన లిక్విడ్ కూల్డ్ 250సీసీ, 4-స్ట్రోక్, 4-వాల్వ్ సింగిల్ సిలిండర్ డిఓహెచ్‌సి ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 25 బిహెచ్‌పిల శక్తిని, 22.9 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
కొత్త హోండా సిబిఆర్ 250ఆర్ ఏబిస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఫీచర్‌తో లభ్యమవుతుంది. ప్రంపంచంలోనే తొలిసారిగా 250సీసీ సెగ్మెంట్లో ఏబిఎస్ పరిచయం చేసిన ఘనత హోండాకే దక్కింది. డైనమిక్ స్పోర్టీ డిజైన్, స్పోర్టీ లుక్‌నిచ్చే బాడీ ప్యానెల్, వై షేప్‌లో ఉండే హెడ్‌లైట్స్, 5-స్పోక్ అల్యూమినియం కాస్ట్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్స్, స్టైలిష్ రియర్ గ్రిప్, స్పోర్టీ స్ప్లిట్ సీట్, బ్రిలియంట్ బ్లూ ఎల్‌సిడి బ్యాక్‌లైట్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, సరికొత్త సైలెన్సర్ వంటి విశిష్టమైన ఫీచర్లు హోండా సిబిఆర్ 250ఆర్ సొంతం.


Click it and Unblock the Notifications








