హోండా బడ్జెట్ బైక్ 'డ్రీమ్ యుగ'కు పెరుగుతున్న ఆదరణ

జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన బడ్జెట్ బైక్ 'హోండా డ్రీమ్ యుగ'కు మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. సరసమైన ధర, స్టయిలిష్ లుక్, పవర్‌ఫుల్ ఇంజన్, సాటిలేని పెర్ఫామెన్స్, తిరుగులేని మైలేజ్ వంటి ఫీచర్లతో ఇది మాస్ బైక్ సెగ్మెంట్‌ కస్టమర్లను ఇట్టే ఆకట్టుకుంటోంది.

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న హోండా డ్రీమ్ యుగ మార్కెట్లోకి విడుదలైన రెండవ నెలలోనే 30,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయంటే ఈ బైక్‌కు ఉన్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థమైపోతుంది. ఈ మోడల్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని హోండా దీని ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచాలని యోచిస్తోంది. డ్రీమ్ యుగ బడ్జెట్ బైక్‌ను హోండా తొలిసారిగా ఈ ఏడాది జనవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది.


హోండా డ్రీమ్ యుగ మోటార్‌సైకిల్‌ విషయానికి వస్తే, ఇందులో ఉపయోగించిన 110సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజన్ 7500 ఆర్‌పిఎమ్ వద్ద 9పిఎస్‌ల శక్తిని విడుదల చేస్తుంది. ఇది మూడు వేరియంట్ల (కిక్ స్టార్ట్ + డ్రమ్ బ్రేక్స్ + స్పోక్ వీల్స్, కిక్ స్టార్ట్ + డ్రమ్ బ్రేక్స్ + అల్లాయ్ వీల్స్, సెల్ఫ్ స్టార్ట్ + డ్రమ్ బ్రేక్స్ + అల్లాయ్ వీల్స్)లో ఐదు ఆకర్షనీయమైన రంగుల్లో (మాపిల్ బ్రౌన్ మెటాలిక్, ఫోర్స్ సిల్వర్ మెటాలిక్, మాన్‌సూన్ గ్రే మెటాలిక్, ఆల్ఫా రెడ్ మెటాలిక్, బ్లాక్) లభ్యమవుతుంది.

హోండా డ్రీమ్ యుగ లీటర్ పెట్రోల్‌కు 72 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. హైదరాబాద్ మార్కెట్లో ఈ బైక్ ధరలు క్రింది విధంగా ఉన్నాయి.

ధరలు (హైదరాబాద్):
డ్రీమ్ యుగ (కిక్-డ్రమ్-స్పోక్) - రూ.46,968 (ఎక్స్-షోరూమ్); రూ.52,432 (ఆన్-రోడ్)
డ్రీమ్ యుగ (కిక్-డ్రమ్-అల్లాయ్) - రూ.48,487 (ఎక్స్-షోరూమ్); రూ.54,104 (ఆన్-రోడ్)
డ్రీమ్ యుగ (సెల్ఫ్-డ్రమ్-అల్లాయ్) - రూ.50,514 (ఎక్స్-షోరూమ్); రూ.56,335 (ఆన్-రోడ్)
(గమనిక: ఆన్-రోడ్ ధరలో యాక్ససరీలు, అదనపు వారంటీ, ఏఎమ్‌సి వంటివి కలిసి ఉండవు).

సెల్ఫ్ స్టార్ట్, అల్లాయ్ వీల్స్, పొడవైన సీట్, ఫుల్ చైన్ కవర్, హీలో-టో గేర్ షిఫ్ట్ లివర్, ట్యూబ్‌లెస్ టైర్స్ వంటి ఫీచర్లతో హోండా డ్రీమ్ యుగ లభ్యమవుతుంది. ఈ ప్రస్తుతం సెగ్మెంట్లోని బజాజ్ డిస్కవర్, టీవీఎస్ స్టార్ సిటీ, హీరో ప్యాషన్ ప్రో, స్ప్లెండర్ ప్రో, యహమా వైబిఆర్ తాజాగా విడుదలైన సుజుకి హయాటే వంటి మోడళ్లకు 110సీసీ హోండా డ్రీమ్ యుగ మోటార్‌సైకిల్ గట్టి పోటీ ఇవ్వనుంది.

More from DriveSpark

Article Published On: Thursday, July 19, 2012, 19:26 [IST]
English summary
The Honda Dream Yuga's price has surprised many as Honda motorcyckes are usually priced slightly higher than other manufacturers. In its second month of sales, Honda's latest budget bike, the Dream Yuga has registered a strong sales of 30,000 units. Honda had earlier stated that it wanted to increase its volume sales and the Dream Yuga would be just a beginning.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+