రూ.42,362 లకే కొత్త డియోను విడుదల చేసిన హోండా

New Honda Dio
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ నుండి లభిస్తున్న స్కూటర్ "డియో" మరో సరికొత్త రిఫ్రెష్డ్ అండ్ అప్‌గ్రేడెడ్ వేరియంట్‌ను కంపెనీ నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. ఇదే సెగ్మెంట్లో ఉన్న ఇతర స్కూటర్లను సవాల్ చేసేలా అత్యంత పోటీ ధరకే హోండా 2012 వెర్షన్ డియో స్కూటర్‌ను ప్రవేశపెట్టింది.

కొత్త 2012 డియో స్కూటర్‌లో మరింత శక్తివంతమైన ఇంజన్‌ను ఉపయోగించడం జరిగింది. ఇందులో ఉపయోగించిన 110సీసీ ఇంజన్ 8 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మార్కెట్లో లభిస్తున్న రెండవ తరం (సెకండ్ జనరేషన్) ఆక్టివాలో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగించడం జరిగింది. ఇది పాత డియోతో (లీటరుకు 55 కి.మీ. మైలేజ్) పోల్చుకుంటే 15 శాతం అధిక మైలేజీనిస్తుంది.

కొత్త 2012 డియో ముందు (ఫ్రంట్) డిజైన్ పూర్తిగా మార్చి వేయబడింది. అలాగే, టెయిల్ లైట్ అరేంజ్‌మెంట్‌ కూడా మార్పు చేయబడింది. ఇందులో కొత్తగా కాంబి బ్రేక్ సిస్టమ్‌ను ఉపయోగించామని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) ఎన్.కె. రతన్ తెలిపారు. స్పోర్టీ లుక్‌, స్పోర్టీ రైడ్ అనుభూతినిచ్చే ఈ స్కూటర్ ధర రూ.42,362 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించామని, ఫిబ్రవరి చివరి నుండి ఇది మార్కెట్లో లభ్యమవుతుందని ఆయన తెలిపారు.

More from DriveSpark

Article Published On: Wednesday, February 1, 2012, 16:57 [IST]
English summary
Honda has launched the new look Dio scooter with an attractive price of Rs.42,362. Honda has redesigned the frontal look of the Dio but has retained the technical specs. The Dio has the same 110cc engine that also powers the Honda Activa.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+