కొత్త సిబిఆర్ 250ఆర్ స్పోర్ట్స్ బైక్‌ను విడుదల చేసిన హోండా
హోండా సిబిఆర్ 250ఆర్ ఇప్పుడు మూడు రంగుల కలయికతో (పెరల్ హెరాన్ బ్లూ) రెండు వేరియంట్లలో (స్టాండర్డ్, ఏబిఎస్)తో లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న క్యాండీ రూబీ రెడ్ విత్ యాక్యురేట్ సిల్వర్ మెటాలిక్, ఆస్ట్రాయిడ్ బ్లాక్ మెటాలిక్ విత్ యాక్యురేట్ సిల్వర్ మెటాలిక్ రంగుల్లో కూడా హోండా సిబిఆర్ 250ఆర్ లభిస్తుంది. కొత్త ట్రై కలర్ హోండా సిబిఆర్ 250ఆర్ ధర ప్రస్తుతం లభిస్తున్న డ్యూయెల్ టోన్ వెర్షన్ కన్నా రూ.1,000 అధనంగా ఉంది.
సాధారణ సిబిఆర్ 250ఆర్ స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 1.44 లక్షలుగా ఉండగా, సి-ఏబిఎస్ వేరియంట్ ధర రూ. 1.69 లక్షలు గానూ ఉంది. కాగా.. ట్రై కలర్ ఆప్షన్ హోండా సిబిఆర్ 250ఆర్ స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 1.45 లక్షలు గానూ, హోండా సిబిఆర్ 250ఆర్ సి-ఏబిఎస్ వేరియంట్ ధర రూ. 1.70 లక్షలు గానూ ఉంది. (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
హోండా సిబిఆర్ 250ఆర్‌లో కొత్తగా అభివృద్ధి చేసిన లిక్విడ్ కూల్డ్ 250సీసీ, 4-స్ట్రోక్, 4-వాల్వ్ సింగిల్ సిలిండర్ డిఓహెచ్‌సి ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 25 బిహెచ్‌పిల శక్తిని, 22.9 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డైనమిక్ స్పోర్టీ డిజైన్, స్పోర్టీ లుక్‌నిచ్చే బాడీ ప్యానెల్, వై షేప్‌లో ఉండే హెడ్‌లైట్స్, 5-స్పోక్ అల్యూమినియం కాస్ట్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్స్, స్టైలిష్ రియర్ గ్రిప్, స్పోర్టీ స్ప్లిట్ సీట్, బ్రిలియంట్ బ్లూ ఎల్‌సిడి బ్యాక్‌లైట్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, సరికొత్త సైలెన్సర్ వంటి విశిష్టమైన ఫీచర్లు హోండా సిబిఆర్ 250ఆర్ సొంతం.


Click it and Unblock the Notifications









