విడుదలకు సిద్ధమవుతున్న హోండా చీప్ స్పోర్ట్స్ బైక్
ట్రూ రేసింగ్ సెన్సేషన్‌తో రూపొందించిన హోండా సిబిఆర్ 150ఆర్‌లో 150సీసీ లిక్విడ్ కూల్డ్, డిఓహెచ్‌సి పిజిఎమ్-ఎఫ్ఐ ఇంజన్ వంటి విశిష్టమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఇంజన్ 10,500 ఆర్‌పిఎమ్ వద్ద 18 బిహెచ్‌పిల శక్తిని, 7500 ఆర్‌పిఎమ్ వద్ద 12.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇందులో ట్విన్ ట్యూబ్లర్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు. ఇది కూడా సిబిఆర్ 250ఆర్ మాదిరిగానే రియర్ మోనో సస్పెన్షన్ (సింగిల్ షాక్ అబ్జార్వర్)తో లభిస్తుంది.
ఆకర్షనీయమైన డిజైన్, సరికొత్త బాడీ గ్రాఫిక్స్, ఫ్రండ్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్, విశాలమైన ట్యూబ్‌లెస్ టైర్స్ వంటి విశిష్టమైన ఫీచర్లతో ఇది లభ్యం కానుంది. ఇందులో ఉపయోగించిన అడ్వాన్స్ ఓ2 సెన్సార్, ఎయిర్ ఇండక్టర్‌లు తక్కువ కర్బన ఉద్ఘారాలను వెలువడేలా చేస్తాయి. హోండా సిబిఆర్ 150ఆర్ స్టాండర్డ్, డీలక్స్ అనే రెండు వేరియంట్లలో, రెండు రంగులలో లభ్యం కానుంది.


Click it and Unblock the Notifications









