హోండా సిబిఆర్ 250ఆర్ బైక్‌లలో ఫ్రంట్ బ్రేక్ సమస్య; రీకాల్

By Ravi

మీ హోండా సిబిఆర్ 250ఆర్ బైక్‌కు బ్రేకులు సరిగ్గా పనిచేస్తున్నాయా..? ఎందుకైనా మంచిది మరోసారి చెక్ చేసుకోండి. హోండా అందిస్తున్న ఈ స్పోర్ట్స్ బైక్‌లో ముందు బ్రేకులలో సమస్య కారణంగా కంపెనీ వీటిని వెనక్కి పిలిపిస్తోంది. మార్చ్ 2011 నుంచి సెప్టెంబర్ 2012 మధ్య కాలంలో తయారైన 11,500 యూనిట్ల స్టాండర్డ్ వేరియంట్ హోండా సిబిఆర్ 250ఆర్ బైక్‌లలో ముందు బ్రేకులు సరిగ్గా పనిచేయని కారణంగా వీటిని రీకాల్ చేస్తున్నామని హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) ఓ ప్రకటనలో పేర్కొంది.

అయితే, ఈ బ్రేకింగ్ సమస్య వలన సాధారణ రైడింగ్ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో మాత్రం బ్రేకులు సరిగ్గా పనిచేయకపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఈ సమస్యను సరిచేసేందుకు ఈ బైక్‌లను వెనక్కు పిలిపిస్తున్నామని హోండా వివరించింది. ఈ సమస్య గురించి హోండా డీలర్లు తమ కస్టమర్లకు ప్రత్యేకంగా సమాచారం అందిస్తున్నారు. అలా కాకుండా, తమ వాహనం ఈ రీకాల్‌కు వర్తిస్తుందో లేదో అని తెలుసుకోవాలనుకునే హోండా వినియోగదారులు www.honda2wheelersindia.com/cbr250r/servicecampaign.aspx వెబ్‌సైట్‌కు లాగిన్ అయ్యి, వెహికల్ ఐడెంటిటీ నెంబర్ (వి.ఐ.ఎన్)ను ఎంటర్ చేయటం ద్వారా తెలుసుకోవచ్చు.

Honda CBR 250R

హోండా ఉచితంగా ఈ సమస్యను పరిష్కరిస్తోంది. ఒకవేళ మోటార్‌సైకిల్ వారంటీ తీరిపోయినప్పటికీ కూడా కంపెనీ ఈ సమస్యను ఉచితంగా సరిచేయనుంది. ఈ సెగ్మెంట్లోని కవాసకి నిన్జా 250, హ్యోసంగ్ జిటి250ఆర్ వంటి మోటార్‌సైకిళ్లకు పోటీగా హోండా అందిస్తున్న సిబిఆర్ 250ఆర్ రెండు వేరియంట్లలో (స్టాండర్డ్, ఏబిఎస్) లభిస్తుంది. ప్రస్తుతం రీకాల్‌కు గురైన వాహనాలన్ని కూడా స్టాండర్ వేరియంట్‌కు చెందినవే. కాగా.. హైదరాబాద్ మార్కెట్లో హోండా సిబిఆర్ 250ఆర్ మోటార్‌సైకిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:
  • హోండా సిబిఆర్ 250ఆర్ ఏబిఎస్ - రూ. 1,79,554
  • హోండా సిబిఆర్ 250ఆర్ స్టాండర్డ్ - రూ. 1,53,248
  • హోండా సిబిఆర్ 250ఆర్ స్టాండర్డ్ ట్రైకలర్ - రూ. 1,54,285
  • హోండా సిబిఆర్ 250ఆర్ ఏబిఎస్ ట్రైకలర్ - రూ. 1,80,591

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

More from DriveSpark

Article Published On: Monday, November 19, 2012, 19:39 [IST]
English summary
Japanese two wheeler maker, Honda Motorcycle and Scooter India (HMSI) has recalled 11,500 units of standard variant Honda CBR250R sports bikes due to front brake malfunction. These bike were produced between March of 2011 to September 2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+