సిబిఆర్ 250ఆర్‌లో కొత్త కలర్స్‌ను ప్రవేశపెట్టిన హోండా

హోండా సిబిఆర్ 250ఆర్ ఇప్పుడు మూడు రంగుల కలయికతో (పెరల్ హెరాన్ బ్లూ) కూడిన స్పోర్టీ ఆప్షన్‌తో లభ్యమవుతుంది. ఇది కాకుండా ప్రస్తుతం డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్‌తో అందుబాటులో ఉన్న క్యాండీ రూబీ రెడ్ విత్ యాక్యురేట్ సిల్వర్ మెటాలిక్, ఆస్ట్రాయిడ్ బ్లాక్ మెటాలిక్ విత్ యాక్యురేట్ సిల్వర్ మెటాలిక్ రంగుల్లో కూడా లభిస్తుంది. హోండా సిబిఆర్ 250ఆర్‌లో కొత్తగా అభివృద్ధి చేసిన లిక్విడ్ కూల్డ్ 250సీసీ, 4-స్ట్రోక్, 4-వాల్వ్ సింగిల్ సిలిండర్ డిఓహెచ్‌సి ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 25 బిహెచ్‌పిల శక్తిని, 22.9 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
కొత్త హోండా సిబిఆర్ 250ఆర్ ఏబిస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఫీచర్‌తో లభ్యమవుతుంది. ప్రంపంచంలోనే తొలిసారిగా 250సీసీ సెగ్మెంట్లో ఏబిఎస్ పరిచయం చేసిన ఘనత హోండాకే దక్కింది. డైనమిక్ స్పోర్టీ డిజైన్, స్పోర్టీ లుక్‌నిచ్చే బాడీ ప్యానెల్, వై షేప్‌లో ఉండే హెడ్‌లైట్స్, 5-స్పోక్ అల్యూమినియం కాస్ట్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్స్, స్టైలిష్ రియర్ గ్రిప్, స్పోర్టీ స్ప్లిట్ సీట్, బ్రిలియంట్ బ్లూ ఎల్‌సిడి బ్యాక్‌లైట్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, సరికొత్త సైలెన్సర్ వంటి విశిష్టమైన ఫీచర్లు హోండా సిబిఆర్ 250ఆర్ సొంతం. ఈ కొత్త కలర్ ఆప్షన్ కలిగిన హోండా సిబిఆర్ 250ఆర్ త్వరలోనే స్టాండర్డ్, సి-ఏబిఎస్ వేరియంట్లలో లభ్యం కానుంది.


Click it and Unblock the Notifications








