ఆటో ఎక్స్‌పో: హోండా 110సిసి బైక్ "డ్రీమ్ యుగ" ఆవిష్కరణ

హోండా బైక్‌లంటే ఇష్టపడే వారికి శుభవార్త. తక్కువ ధరలో హోండా బ్రాండ్ బైక్ సొంతం చేసుకోవాలనుకునే వారి కోసం ఈ జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓ సరికొత్త బడ్జెట్‌బైక్‌ను దేశీయ విపణిలో ఆవిష్కరించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న 11వ అంతర్జాతీయ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో "డ్రీమ్ యుగ" అనే ఓ 110సీసీ మోటార్‌సైకిల్‌ను హోండా ఆవిష్కరించింది.

ప్రస్తుతం 100సీసీ సెగ్మెంట్లో బలహీనంగా ఉన్న హోండా ఈ విభాగంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు గానూ ఈ సరికొత్త మోటార్‌సైకిల్‌ను ప్రవేశపెట్టింది. ఈ విభాగంలో కంపెనీ ఇప్పటికే ట్విస్టర్ (100సీసీ)ను అందిస్తుండగా, తాజాగా "డ్రీమ్ యుగ"ను ప్రవేశపెట్టింది. అయితే, ఈ బైక్‌ను వాణిజ్య పరంగా ఎప్పుడు మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది, ధర తదితర వివరాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

హోండా 110సీసీ బైక్ డ్రీమ్ యుగ చూడటానికి పాత మోడల్ హోండా షైన్ బైక్‌లా అనిపిస్తుంది. బహుశా హోండా సిబి ట్విస్టర్‌లో ఉపయోగించిన 110సీసీ ఇంజన్‌నే డ్రీమ్ యుగలో కూడా ఉపయోగించి ఉండవచ్చునని నిపుణులు భావిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 10, 2012, 16:35 [IST]
English summary
The 11th Indian Auto Expo has seen several new models being launched. While some are updates to existing models, there have been few that are completely new. While the cars have been getting a lot of attention, the two wheeler segment which accounts for far bigger sales is playing a second fiddle. However there have been several notable motorcycles that have caught our eye at the Auto Expo.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+