కొద్ది రోజుల్లోనే జిటి250ఆర్‌‌కు వందకు పైగా బుకింగ్‌లు

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ 'హ్యోసంగ్' తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన తక్కువ ఇంజన్ సీసీ కలిగిన స్పోర్ట్స్ బైక్ "హ్యోసంగ్ జిటి250ఆర్"కు మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. గడచిన వారంలో విడుదలైన ఈ స్పోర్ట్స్ బైక్ ఇప్పటికే 100 యూనిట్లకు పైగా బుకింగ్‌లను సొంతం చేసుకుని విజయవంతంగా దూసుకుపోతుంది. భారత మార్కెట్లో "హ్యోసంగ్ జిటి250ఆర్" స్పోర్ట్స్ బైక్ ధర రూ.2.75 లక్షలుగా ఉంది.

ప్రస్తుతం హ్యోసంగ్ జిటి250ఆర్ స్పోర్ట్స్ బైక్‌ను దిగుమతి చేసుకొని ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న కారణంగా, భారత మార్కెట్లో ఈ మోడల్ అధికంగా ఉంది. వీలైనంత త్వరలో ఈ మోడల్‌ను ఇండియన్ మార్కెట్లో లభ్యమయ్యే విడిభాగాలతో కలిపి ఇక్కడే అసెంబ్లింగ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇలా చేయడం వలన ఈ స్పోర్ట్స్ బైక్ ధర భారీగా తగ్గనుంది. హ్యోసంగ్ జిటి250ఆర్‌ను ఇండియాలనే అసెంబ్లిగ్ చేసినట్లయితే దీని ధర రూ.1.5 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు తగ్గే ఆస్కారం ఉందని కంపెనీ పేర్కొంది.


ఇదే గనుక జరిగితే, ఈ సెగ్మెంట్లో జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా అందిస్తున్న సిబిఆర్ 250ఆర్ స్పోర్ట్స్‌బైక్‌కు, బజాజ్ అందిస్తున్న నిన్జా 250సీసీ బైక్‌లకు ధర పరంగా ఇది గట్టి పోటీని ఇవ్వనుంది. ప్రస్తుతం హ్యోసంగ్‌కు దేశవ్యాప్తంగా 18 డీలర్‌షిప్‌ కేంద్రాలున్నాయి. వీటన్నింటినిలోనూ హ్యోసంగ్ జిటి250ఆర్ బైక్‌లు లభ్యం కానున్నాయి. హ్యోసంగ్ ఇండియాలో కార్యకలాపాలు నిర్వహించేందుకు గతంలో పూనేకు చెందిన గార్వారే మోటార్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం గార్వారేతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకొని తిరిగి పూనేకు చెందిన డిఎస్‌కె మోటోవీల్స్‌తో ఒప్పందం కుదర్చుకున్న కంపెనీ ఇటీవలే పేర్కొంది.

హ్యోసంగ్ జిటి250ఆర్ స్పోర్ట్స్ బైక్ క్లుప్తంగా...:
హ్యోసంగ్ జిటి250ఆర్‌లో ఉపయోగించిన 250సీసీ వి-ట్విన్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్ 28 బిహెచ్‌పిల శక్తిని, 23 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌లో డ్యూయెల్ కూలింగ్ సిస్టమ్ ఉంది (ఆయిల్ కూలింగ్, ఎయిర్ కూలింగ్). ఫ్యూయెల్ ఇంజక్షన్ టెక్నాలజీతో కూడిన ఈ ఇంజన్ మంచి పెర్ఫామెన్స్‌ను, మైలేజ్‌ను అందిస్తుంది.

హ్యోసంగ్ జిటి250ఆర్ స్పోర్ట్స్ బైక్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇది వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ (సింగిల్ షాక్అబ్జార్వర్)ను కలిగి ముందు వైపు ట్విన్ డిస్క్ బ్రేక్, వెనుక వైపు సింగిల్ డిస్క్ బ్రేక్‌తో లభిస్తుంది. ఇది రెండు కలకతో (డ్యుయెల్ టోన్) వైట్-రెడ్, రెడ్-బ్లాక్, సిల్వర్-రెడ్ అనే మూడు ఆకర్షనీయమై రంగుల్లో లభ్యం కానుంది.

More from DriveSpark

Article Published On: Thursday, June 21, 2012, 18:36 [IST]
English summary
Hyosung latest offering in India Hyosung GT250R gets massive response from Indian bike lovers. Hyosung GT250R gets more than 100 bookings in just few days after launching. The GT250R in India is price at Rs.2.7 lakhs Ex-showroom.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+