ఇండియాలో జిటి250ఆర్‌ని విడుదల చేసిన హ్యోసంగ్

ఇప్పటివరకూ పూణేకు చెందిన గార్వారే మోటార్స్‌తో కలిసి ఇండియాలో మార్కెటింగ్ కార్యకలాపాలను నిర్వహించిన కొరియన్ బైక్ మేకర్ 'హ్యోసంగ్' ఇప్పుడు తాజాగా పూణేకు చెందిన డిఎస్‌కే మోటోవీల్స్‌తో చేతులు కలిపింది. అంతేకాకుండా.. తక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన ఓ చీప్ అండ్ బెస్ట్ స్పోర్ట్స్ బైక్‌ను హ్యోసంగ్ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది.

హ్యోసంగ్ నుంచి ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న 250సీసీ బైక్ మార్కెట్లోకి రానే వచ్చింది. కేవలం రూ.2.75 లక్షల ధరకే "హ్యోసంగ్ జిటి250ఆర్" ఇంపోర్టెడ్ స్పోర్ట్స్ బైక్‌ను దేశీయ విపణిలో అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ఈ మోడల్‌ను విదేశాల్లో పూర్తిగా తయరు చేసి, ఇక్కడి మార్కెట్లోకి దిగుమతి చేసుకుంటున్న కారణంగా, దీని ధర ఇంత అధికంగా ఉంది.


అయితే, త్వరలోనే ఈ మోడల్ ఇండియన్ మార్కెట్లోనే లభ్యమయ్యే విడిభాగాలను, విదేశాల నుండి దిగుమతి చేసుకునే ప్రధాన విడిభాగాలను కలిపి ఇక్కడే అసెంబ్లింగ్ చేయనున్నామని, అప్పుడు దీని ధర కేవలం రూ.1.5 లక్షల నుంచి రూ.1.75 లక్షల రేంజ్‌కు దిగినవస్తుందని డిఎస్‌కే మోటోవీల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శిరీష్ కులకర్ణి తెలిపారు. దేశ వ్యాప్తంగా తమకు ఉన్న 18 డీలర్‌షిప్‌లలో హ్యోసంగ్ జిటి250ఆర్ బైక్‌లు లభ్యం కానున్నాయని ఆయన తెలిపారు. కాగా.. గార్వారే మోటార్స్‌తో తమ భాగస్వామ్యాన్ని కూడా రద్దు చేసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

హ్యోసంగ్ జిటి250ఆర్ స్పోర్ట్స్ బైక్ క్లుప్తంగా...:
హ్యోసంగ్ జిటి250ఆర్‌లో ఉపయోగించిన 250సీసీ వి-ట్విన్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్ 28 బిహెచ్‌పిల శక్తిని, 23 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌లో డ్యూయెల్ కూలింగ్ సిస్టమ్ ఉంది (ఆయిల్ కూలింగ్, ఎయిర్ కూలింగ్). ఫ్యూయెల్ ఇంజక్షన్ టెక్నాలజీతో కూడిన ఈ ఇంజన్ మంచి పెర్ఫామెన్స్‌ను, మైలేజ్‌ను అందిస్తుంది.

హ్యోసంగ్ జిటి250ఆర్ స్పోర్ట్స్ బైక్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇది వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ (సింగిల్ షాక్అబ్జార్వర్)ను కలిగి ముందు వైపు ట్విన్ డిస్క్ బ్రేక్, వెనుక వైపు సింగిల్ డిస్క్ బ్రేక్‌తో లభిస్తుంది. ఇది రెండు కలకతో (డ్యుయెల్ టోన్) వైట్-రెడ్, రెడ్-బ్లాక్, సిల్వర్-రెడ్ అనే మూడు ఆకర్షనీయమై రంగుల్లో లభ్యం కానుంది.

More from DriveSpark

Article Published On: Friday, June 15, 2012, 10:29 [IST]
English summary
Hyosung has officially begun its partnership with DSK by launching its latest sports bike the GT250R in India with a starting price of Rs.2.7 lakhs. The GT250R is aimed at the likes of the Kawasaki Ninja and Honda CBR 250R considering its high price tag. We were expecting the price to be under the Rs. 2 lakhs mark.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+