హ్యుందాయ్ 12వ ఎడిషన్ ఫ్రీ సర్వీస్ క్యాంప్ ప్రారంభం
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా 12వ ఎడిషన్ ఉచిత కార్ కేర్ క్లినిక్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. నిపుణులైన టెక్నీషియన్ల ద్వారా తమ కస్టమర్ల అత్యుత్తమ వెహికల్ సర్వీసింగ్ సేవలను కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ క్యాంపైన్ నిర్వహిస్తున్నామని, ఇది మార్చి 16 నుండి 25వ తేదీ వరకూ జరుగుతుందని కంపెనీ తెలిపింది.
హ్యుందాయ్‌కు దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 785 వర్క్‌షాపుల ద్వారా ఈ సేవలను అందించనున్నానమని, ఇందులో భాగంగా ఈ సర్వీస్ క్యాంప్‌కు తీసుకువచ్చే హ్యుందాయ్ వాహనాల ఇంజన్, ట్రాన్సిమిషన్, ఎలక్ట్రిక్ సిస్టమ్, అండర్ బాడీ, ఏసి, ఎక్స్టీరియర్ వంటి 80 పాయింట్ చెకప్ చేస్తామని, ఈ సమయంలో విడిభాగాలపై 10 శాతం తగ్గింపును కూడా అందిస్తామని కంపెనీ పేర్కొంది.
ఆటోమొబైల్ యాక్ససరీలు, ఎక్స్‌టెండెడ్ వారంటీ, ఇతర వ్యాల్యూ యాడెడ్ సర్వీస్‌లపై 10 శాతం తగ్గింపుతో పాటుగా, లేబర్ చార్జీలపై దాదాపు 20 శాతం తగ్గింపును కూడా హ్యుందాయ్ అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ ఈవెంట్‌ను స్పాన్సర్ చేస్తున్న షెల్ ఇండియా, హెచ్ఓఈసి బర్దాల్‌లు ఆకర్షనీమైన ఆఫర్లను అందిస్తున్నాయి. మరి మీ హ్యుందాయ్ వాహనాన్ని కూడా వర్క్‌షాప్‌కు తీసుకువెళ్తున్నారా..?


Click it and Unblock the Notifications









