క్యాస్ట్రాల్ నుంచి గేర్‌లెస్ స్కూటర్ల కోసం ప్రత్యేకమైన ఇంజన్ ఆయిల్

స్కూటర్ సరే అయినా మోటార్‌సైకిల్ సరే ఇంజన్ స్మూత్‌గా నడవాలంటే.. ఇంజన్‌లో తగినంత మరియు నాణ్యమైన ఇంజన్ ఆయిల్ ఉండటం ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో, ఇంజన్ ఆయిల్ తయారీలో ప్రసిద్ధి గాంచిన ప్రముఖ కంపెనీ క్యాస్ట్రాల్ ప్రత్యేకించి గేర్‌లెస్ స్కూటర్ల కోసం ఓ సరికొత్త ఇంజన్ ఆయిల్‌ను విడుదల చేసింది. 'క్యాస్ట్రాల్‌ యాక్టివ్‌ స్కూటర్‌' పేరిట ఓ కొత్త ఇంజన్ ఆయిల్‌ను విడుదల చేస్తున్నామని, ఇండియాలోనే ఈ తరహాలో గేర్‌లెస్ స్కూటర్ల కోసం ప్రత్యేకంగా ఇంజన్ ఆయిల్ అందించటం ఇదే ప్రప్రధమమని క్యాస్ట్రాల్ ఇండియా పేర్కొంది.

అధునాత స్కూటెక్ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన 'క్యాస్ట్రాల్ యాక్టివ్ స్కూటర్' ఇంజన్ ఆయిల్‌లో ఫ్రిక్షన్‌ కలిగిన 4-స్ట్రోక్ ఇంజన్ ఆయిల్‌ను ఆధునిక ఆటోమేటిక్ స్కూటర్ ఇంజన్ల కోసం తయారు చేశారు. మోటార్‌సైకిల్ ఇంజన్ అవసరాల కన్నా గేర్‌లెస్ స్కూటర్ ఇంజన్ అవసరాలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి, మోటార్‌సైకిల్ ఇంజన్లలో ఉపయోగించే సాంప్రదాయ ఇంజన్‌ ఆయిల్‌ను గేర్‌లెస్ స్కూటర్లలో ఉపయోగించినట్లయితే, అవి మంచి పెర్ఫామెన్స్‌ను ఇవ్వలేవు.


అయితే, స్కూటెక్ టెక్నాలజీతో తయారైన క్యాస్ట్రాల్ యాక్టివ్ స్కూటర్ ఇంజన్ ఆయిల్ ఫ్రిక్షన్‌ను తగ్గించి, అధనపు హీట్ ప్రొటెక్షన్‌ను అందిస్తుంది. ఇది మీ గేర్‌లెస్ స్కూటర్‌కు సుపీరియర్ ఆల్ రౌండ్ ప్రొటెక్షన్‌ను కల్పిస్తుంది. హోండా, టీవీఎస్, హీరో మోటోకార్ప్, మహీంద్రా వంటి ప్రముఖ కంపెనీలు అందిస్తున్న అన్ని 4-స్ట్రోక్ ఇంజన్ కలిగిన గేర్‌లెస్/ఆటోమేటిక్ స్కూటర్లకు ఇది చక్కగా సరిపోతుంది.

క్యాస్ట్రాల్ యాక్టివ్ స్కూటర్ ఇంజన్ ఆయిల్‌ను ఉపయోగించటం వలన స్థిరమైన పికప్‌ను పొందటమే కాకుండా, ఇంజన్ స్మూత్‌గా మరియు సమర్థవంగా పనిచేయడంలోనూ, ఇంజన్ జీవిత కాలాన్ని పెంచడంలోనూ ఇది తోడ్పడుతుంది. 800 మి.లీ. ప్యాకెట్లలో లభ్యమయ్యే క్యాస్ట్రాల్ యాక్టివ్ స్కూటర్ ఇంజన్ ఆయిల్‌ ధర కేవలం రూ.245 (ఒక్క 800 మి.లీ. ప్యాకెట్ ధర) మాత్రమేనని క్యాస్ట్రాల్ ఇండియా వెల్లడించింది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 26, 2012, 13:34 [IST]
English summary
Castrol Activ Scooter with revolutionary Scootek technology is an advanced, low friction, 4-stroke engine oil designed specifically for modern automatic scooter engines. Gearless scooter engine requirements are different than motorcycle engines & usage of conventional motorcycle engine oil in gearless scooters does not give best performance. Castrol Activ Scooter which has been specially designed for gearless scooters has Scootek technology which lowers the friction & provides additional heat protection.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+