రే స్కూటర్ ఎఫెక్ట్: నవంబర్‌లో పెరిగిన యమహా అమ్మకాలు

By Ravi

ప్రముఖ జపనీస్ టూవీలర్ కంపెనీ ఇండియా యమహా మోటార్ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన తమ మొట్టమొదటి స్కూటర్ 'యమహా రే' మంచి విజయాన్ని సాధించింది. ప్రత్యేకించి భారతీయ మహిళలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ రూపొందించిన ఈ స్కూటర్‌కు దేశీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడుతోంది. దీనికితోడు కంపెనీ అందిస్తున్న స్పోర్ట్స్ బైక్స్‌కు కూడా మంచి డిమాండ్ వస్తుండటంతో గడచిన నెలలో కంపెనీ అమ్మకాలు జోరుగా సాగాయి.


నవంబర్ 2012లో ఇండియా యమహా మోటార్ మొత్తం అమ్మకాలు 44,691 యూనిట్లుగా నమోదయ్యి, గతేడాది ఇదే సమయంతో పోల్చుకుంటే ఇవి 14 శాతం వృద్ధిని కనబరచాయి. నవంబర్ 2011లో ఇవి 39,162 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదే సమయంలో దేశీయ అమ్మకాలు 33 శాతం వృద్ధిని సాధించి 28,178 యూనిట్ల నుంచి 37,347 యూనిట్లకు పెరిగాయి. అయితే, ఎగుమతులు మాత్రం 10,984 యూనిట్ల నుంచి 7,344 యూనిట్లకు పడిపోయాయి.

ఈ సందర్భంగా ఇండియా యమహా మోటార్ నేషనల్ బిజినెస్ హెడ్ రాయ్ కురియెన్ మాట్లాడుతూ.. మార్కెట్ సెంటిమెంట్‌ను మార్చడంలో పండుగ సీజన్ కీలక పాత్ర పోషించిందని, ఏదేమైనప్పటికీ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు మరియు ద్రవ్యోల్బణ పెరుగుదల వంటి కారణాల వలన గడచిన పండుగ సీజన్‌తో ఈ పండుగ సీజన్‌లో అమ్మకాలు అశించినంత రీతిలో జరగలేదని ఆయన అన్నారు. పటిష్టమైన ఉత్పత్తుల శ్రేణి, పెరుగుతున్న వినియోగదారుల విశ్వసనీయత మరియు కొత్త ఉత్పత్తుల విడుదల వల్లే అమ్మకాలు వృద్ధి చెందాయని ఆయన అన్నారు.

అమ్మకాలను పెంచుకునేందుకు యమహా సేఫ్ రైడింగ్ సైన్స్ ప్రోగ్రామ్, ఆర్15 వన్ మేక్ రేస్ ఛాంపియన్‌షిప్స్ వంటి వివిధ కార్యక్రమాలతో వినియోగదారులకు చేరువు అవుతున్నామని, ప్రత్యేకించి మహిళల కోసం త్వరలోనే యమహా ఫిమేల్ రైడింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేయాలనుకుంటున్నామని కురియెన్ చెప్పారు.

More from DriveSpark

Article Published On: Monday, December 3, 2012, 10:30 [IST]
English summary
Japanese two-wheeler maker India Yamaha Motor has reported 14 per cent increase in sales at 44,691 units in November 2012. The company had posted sales of 39,162 in the same month last year, India Yamaha Motor said in a statement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+