కార్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పరిచయం చేయనున్న ఇంటెల్
కంప్యూటర్ ప్రాసెసర్లు, ఎలక్ట్రానిక్ చిప్‌లు తయారు చేయడంలో ప్రపంచ ఖ్యాతి గాంచిన ఇంటెల్, ఇప్పుడు కార్లపై దృష్టి సారించింది. కార్లలో ఓ ప్రత్యేతమైన సమాచార వ్యవస్థను అందించేందుకు ఇంటెల్ కార్పోరేషన్ ముందుకు వచ్చింది. ఈ మేరకు ప్యాసింజర్ కార్లలో 'ఇన్-వెహికల్ ఇన్ఫోటైన్‌మెంట్' (ఐవిఐ) అనే వ్యవస్థను పరిచయం చేసేందుకు భారత కార్ల తయారీదారులతో ఇంటెల్ చర్చలు జరుపుతోంది.
దీని గురించి ఇంటెల్ కార్పోరేషన్ సేల్స్ డైరెక్టర్ (సౌత్) బి సూర్యనారాయణ వివరిస్తూ.. ఈ ఐవిఐ వ్యవస్థలో, డ్యాష్‌బోర్డ్‌పై రెండు తెరలు (స్క్రీన్స్) అమర్చబడి ఉంటాయని, ఇందులో ఒకటి డ్రైవర్ కోసం, మరొకటి ప్యాసింజర్ కోసం ఉపయోగపడుతాయని తెలిపారు. అయితే, ఇది ఇండియాలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని ఖచ్చితందా చెప్పలేమని, ప్రస్తుతం వివిధ కార్ మేకర్లతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన తెలిపారు.
ఈ వ్యవస్థలో డ్రైవర్ కోసం కేటాయించబడిన స్క్రీన్‌పై నావిగేషన్, మ్యాప్స్, డ్రైవింగ్ ఇన్ఫర్మేషన్ వంటి సమాచారాన్ని పొందవచ్చు. అలాగే, ప్యాసింజర్ కోసం కేటాయించిన తెరపై పాటలు, సినిమాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ రెండు స్క్రీన్‌లు కూడా వేర్వేరుగా పనిచేస్తాయి. ఐవిఐ సిస్టమ్‌ను కార్లలో పరిచయం చేసేందుకు ఇంటెల్ ఇప్పటికే కియా మోటార్స్ కార్పోరేషన్‌తో ఓ టై-అప్‌ను ఏర్పరచుకుంది. కియా అందిస్తున్న కె9 లగ్జరీ సెడాన్‌లో ఈ ఐవిఐ సిస్టమ్‌ను పరిచయం చేయనున్నారు.


Click it and Unblock the Notifications








