వేలానికి జేమ్స్ బాండ్ ఉపయోగించిన హోండా బైక్
జేమ్స్ బాండ్ తాజా చిత్రం 'స్కైఫాల్' (Skyfall)లో డానియేల్ క్రైగ్ (జేమ్స్ బాండ్ పాత్ర పోషించిన హాలీవుడ్ హీరో) నడిపిన మోడిఫైడ్ హోండా ఆఫ్-రోడింగ్ మోటార్‌సైకిల్ ఇప్పుడు వేలానికి వచ్చింది. జేమ్స్ బాండ్ పాత్ర పుట్టి 50 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా భారీ హైప్‌తో మార్కెట్లోకి వచ్చిన ఈ 23వ జేమ్స్ బాండ్ సినిమా స్కైఫాల్‌లో డానియేల్ క్రైగ్ హోండా సిఆర్‌ఎఫ్ 250ఆర్ మోటార్‌సైకిల్‌ను హోండా బిబిసి పిల్లల కోసం దానం చేయాలని నిర్ణయించింది. ఈ బైక్‌ను వేలం వేయటం ద్వారా వచ్చే మొత్తాన్ని అనాధ పిల్లల కోసం ఉపయోగించనున్నారు.
స్కైఫాల్ సినిమాలోని థ్రిల్లింగ్ ఓపెనింగ్ చేస్ సీక్వెన్స్‌లో టర్కిష్ స్ట్రీట్ మర్చెంట్ నుంచి బాండ్ ఈ బైక్‌ను అరువు తీసుకుంటాడు. ఇరుకు రోడ్లు, మెట్లపై రయ్ రయ్‌మని దూసుకుపోతూ అద్దిరిపోయే బైక్ స్టంట్‌లను బాండ్ ఈ బైక్‌తో చేయడాన్ని మనం ఈ సినిమాలో గమనించవచ్చు. బాండ్ నడిపిన ఈ సెలబ్రిటీ బైక్‌ను లండన్‌లో వేలం వేయనున్నారు. బిబిసి పిల్లలకు మద్ధతు ఇవ్వటం తమకు సంతోషంగా ఉందని, ఈ మోడిఫైడ్ బైక్ ప్రత్యేకమైనది, విశిష్టమైనది మరియు ఆసక్తికరమైనదని హోండా యూకే మేనేజర్ (కార్పోరేట్ కమ్యూనికేషన్స్) ఫియోనా కోల్ తెలిపారు.

జేమ్స్ బాండ్ - స్కైఫాల్
జేమ్స్ బాండ్ తాజా చిత్రం 'స్కైఫాల్' (Skyfall)లో డానియేల్ క్రైగ్ (జేమ్స్ బాండ్ పాత్ర పోషించిన హాలీవుడ్ హీరో) నడిపిన మోడిఫైడ్ హోండా ఆఫ్-రోడింగ్ మోటార్‌సైకిల్ ఇప్పుడు వేలానికి వచ్చింది.

జేమ్స్ బాండ్ - హోండా సిఆర్‌ఎఫ్ 250ఆర్
23వ జేమ్స్ బాండ్ సినిమా స్కైఫాల్‌లో డానియేల్ క్రైగ్ హోండా సిఆర్‌ఎఫ్ 250ఆర్ మోటార్‌సైకిల్‌ను హోండా బిబిసి పిల్లల కోసం దానం చేయాలని నిర్ణయించింది. ఈ బైక్‌ను వేలం వేయటం ద్వారా వచ్చే మొత్తాన్ని అనాధ పిల్లల కోసం ఉపయోగించనున్నారు.

జేమ్స్ బాండ్ - బైక్ ఛేజింగ్ సీన్
స్కైఫాల్ సినిమాలోని థ్రిల్లింగ్ ఓపెనింగ్ చేస్ సీక్వెన్స్‌లో టర్కిష్ స్ట్రీట్ మర్చెంట్ నుంచి బాండ్ ఈ బైక్‌ను అరువు తీసుకుంటాడు. ఇరుకు రోడ్లు, మెట్లపై రయ్ రయ్‌మని దూసుకుపోతూ అద్దిరిపోయే బైక్ స్టంట్‌లను బాండ్ ఈ బైక్‌తో చేయడాన్ని మనం ఈ సినిమాలో గమనించవచ్చు.

బిబిసి పిల్లలకు హోండా బైక్ దానం
బాండ్ నడిపిన ఈ సెలబ్రిటీ బైక్‌ను నవంబర్ 22, 2012న లండన్‌లో వేలం వేయనున్నారు. బిబిసి పిల్లలకు మద్ధతు ఇవ్వటం తమకు సంతోషంగా ఉందని, ఈ మోడిఫైడ్ బైక్ ప్రత్యేకమైనది, విశిష్టమైనది మరియు ఆసక్తికరమైనదని హోండా యూకే మేనేజర్ (కార్పోరేట్ కమ్యూనికేషన్స్) ఫియోనా కోల్ తెలిపారు.

స్కైఫాల్ - బైక్ ఛేజింగ్ సీక్వెల్
ఈ సినిమాలో బైక్ చేజ్‌తో కూడిన ఓ పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశం ఉంటుంది. ఈ సన్నివేశాన్ని టర్కీ రోడ్లపై చిత్రీకరించారు.

స్కైఫాల్ - మోడిఫైడ్ బైక్స్
ఈ సినిమాలో డానియేల్ క్రైగ్ (జేమ్స్ బాండ్ పాత్రధారి) మరియు ఓలా రాపాస్ (పాట్రీస్ పాత్రధారి)ల కోసం రెండు మోడిఫైడ్ మోటార్‌సైకిళ్లను తయారు చేయటం జరిగింది. ఈ రెండు మోటార్‌సైకిళ్లను మాత్రం ప్రత్యేకంగా అక్కడి ప్రాంతీయతకు అనుగుణంగా డిజైన్ చేశారు.
బిబిసి చిల్డ్రన్ 'నీడ్ ఫర్ ఆక్షన్' అనే కార్యక్రమంలో వేలం కోసం ప్రముఖులు ఉపయోగించిన వస్తువులను సేకరించి వాటిని వేలంలో విక్రయించి, దాని ద్వారా వచ్చిన నిధులను అనాధ పిల్లల కోసం ఉపయోగించనున్నారు. నీడ్ ఫర్ ఆక్షన్‌కు ఇప్పటి వరకూ వచ్చిన వస్తువుల్లో బాండ్ వాడికే అత్యంత విలువైనదిగా నిలువనుందని సమాచారం. వేలంలో వేలాది పౌండ్లను తెచ్చిపెట్టవచ్చని భావిస్తున్నారు.
ఈ సినిమాలో డానియేల్ క్రైగ్ (జేమ్స్ బాండ్ పాత్రధారి) మరియు ఓలా రాపాస్ (పాట్రీస్ పాత్రధారి)ల కోసం రెండు మోడిఫైడ్ మోటార్‌సైకిళ్లను తయారు చేయటం జరిగింది. ఈ సినిమాలో బైక్ చేజ్‌తో కూడిన ఓ పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశం ఉంటుంది. ఈ సన్నివేశాన్ని టర్కీ రోడ్లపై చిత్రీకరించారు. ఇందులో సుమారు 20 హోండా బైక్‌లను ఉపయోగించారు. కాగా.. ఈ రెండు మోటార్‌సైకిళ్లను మాత్రం ప్రత్యేకంగా అక్కడి ప్రాంతీయతకు అనుగుణంగా డిజైన్ చేశారు.


Click it and Unblock the Notifications








