జేమ్స్ బాండ్ సినిమాల్లో ఆస్టన్ మార్టిన్ కార్లకు కాలం చెల్లు; హోండా బైక్‌కు చోటు
ఇప్పటి వరకూ వచ్చిన జేమ్స్ బాండ్ సినిమాల్లో మనం ఎక్కువగా ఆస్టన్ మార్టిన్ కార్లను చూస్తూ వచ్చాం. అయితే, తాజాగా రానున్న 23వ జేమ్స్ బాండ్ చిత్రం 'స్కైఫాల్' (Skyfall)లో ఈసారి కాస్తం వెరైటీగా బాండ్ బైక్‌పై దర్శనమివ్వనున్నాడు. అక్టోబర్ 26న విడుదల కానున్న ఈ సరికొత్త బాండ్ సినిమాలో జేమ్స్ బాండ్ ఓ హోండా ఆఫ్-రోడింగ్ మోటార్‌సైకిల్‌పై కనిపించనున్నాడు.
ఈ 23వ జేమ్స్ బాండ్ సినిమా స్కైఫాల్‌లో డానియేల్ క్రైగ్ (జేమ్స్ బాండ్ పాత్రధారి) మరియు ఓలా రాపాస్ (పాట్రీస్ పాత్రధారి)ల కోసం రెండు మోడిఫైడ్ హోండా సిఆర్‌ఎఫ్ 250ఆర్ మోటార్‌సైకిళ్లను తయారు చేయటం జరిగింది. ఈ సినిమాలో బైక్ చేజ్‌తో కూడిన ఓ పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశం ఉండనుంది. ఈ సన్నివేశాన్ని టర్కీ రోడ్లపై చిత్రీకరించారు. ఇందులో సుమారు 20 హోండా బైక్‌లను ఉపయోగించారు. కాగా.. ఈ రెండు మోటార్‌సైకిళ్లను మాత్రం ప్రత్యేకంగా అక్కడి ప్రాంతీయతకు అనుగుణంగా డిజైన్ చేశారు.
అయితే, ఈ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయాలంటే ఈ బైక్‌ల కన్నా పవర్ కలిగిన బైక్‌లు అవసరం కదా. అందుకే, ఈ స్టన్నింగ్ స్టంట్‌లను చిత్రీకరించేందుకు గానూ రెండు సిఆర్ఎఫ్ 450ఆర్ మోటార్‌సైకిళ్లను ఉపయోగించారు. సులువుగా మోడిఫై చేసేందుకు నాణ్యమైన, శక్తివంతమైన మోటార్‌సైకిల్ అవసరమని, అందుకే ఈ బైక్‌లను ఎంచుకున్నామని స్కైఫాల్ చిత్రానికి స్టంట్ కోఆర్డినేటర్‌గా వ్యవహరించిన గ్యారీ పోవెల్ తెలిపారు.


Click it and Unblock the Notifications








