వేసవిలో సైతం చల్లగా ఉండే 'జాయ్‌రైడ్' సీట్ కవర్స్
అయితే, ఇందుకు ఓ పరిష్కారం ఉంది. "రాయల్ టచ్" బ్రాండ్ పేరుతో టొయోటా, మారుతి సుజుకి, మహీంద్రా వంటి కంపెనీలను లెథర్ ఉత్పత్తులను అందిస్తున్నవినయ్‌రాయల్ ప్లాస్టికోట్స్ లిమిటెడ్ కంపెనీ ద్విచక్ర వాహనాల కోసం "జాయ్‌రైడ్" ఓ సరికొత్త సీట్ కవర్‌ను విడుదల చేసింది. సుపీరియర్ క్వాలిటీ లెథర్‌తో తయారు చేబడిన ఈ సీట్ కవర్ మండు వేసవిలో సైతం చల్లగా ఉండి, సీట్ కవర్ ఉష్టోగ్రతను 15 నుండి 20 డిగ్రీల వరకూ ఉంచుతుంది.
భారతీయ వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేసిన ఈ ఉత్పత్తి హీట్ మేనేజ్‌మెంట్, ధృడత్వం, మన్నిక, పర్యావరణ సాన్నిహిత్యాలను కలిగి ఉండి ధరకు తగ్గ విలువను కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. జాయ్‌రైడ్ సీట్ కవర్ అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుని మూడేళ్ల వారంటీతో లభిస్తుంది. జాయ్‌రైడ్ టూవీలర్ సీట్ కవర్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం వినయ్‌రాయల్ డాట్‌కామ్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.


Click it and Unblock the Notifications
