హ్యోసంగ్ ఎస్‌టి7 బైక్‌ను కొనుగోలు చేసిన సుదీప్
ఈగ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రను పోషించి, తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కన్నడ నటుడు సుదీప్ (కిచ్చా) ఇప్పుడు ఓ సూపర్‌బైక్ ఓనర్ అయ్యాడు. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఎస్&టి మోటార్స్ (హ్యోసంగ్ మాతృ సంస్థ) భారత మార్కెట్లో అందిస్తున్న హ్యోసంగ్ ఎస్‌టి7 మోటార్‌సైకిల్‌ను సుదీప్ కొనుగోలు చేశాడు. హ్యోసంగ్ భారత్‌లో తొలిసారిగా విడుదల చేసిన రెండు మోడళ్లలో ఎస్‌టి7 కూడా ఒకటి (మరొకటి జిటి650ఆర్).
హ్యోసంగ్ ఎస్‌టి7 మోటార్‌సైకిల్‌లో 678.2సీసీ, 4-స్ట్రోక్, వి-ట్విన్, డిఓహెచ్‌సి వాటర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 8000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 57.66 బిహెచ్‌పిల శక్తిని, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 57 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ ట్రాన్సిమిషన్ (5 గేర్లు - 1 క్రిందకు, 4 పైకి)తో లభ్యమవుతుంది. హ్యోసంగ్ ఎస్‌టి7 మోటార్‌సైకిల్ గరిష్ట వేగం గంటకు 176 కిలోమీటర్లు. ఇది మూడు ఆకర్షనీయమైన రంగుల్లో (వైట్, రెడ్, బ్లాక్) అందుబాటులో ఉంది.

సుదీప్ - హ్యోసంగ్ ఎస్‌టి7

హ్యోసంగ్ ఎస్‌టి7

హ్యోసంగ్ ఎస్‌టి7

హ్యోసంగ్ ఎస్‌టి7

హ్యోసంగ్ ఎస్‌టి7

హ్యోసంగ్ ఎస్‌టి7

హ్యోసంగ్ ఎస్‌టి7

హ్యోసంగ్ ఎస్‌టి7

హ్యోసంగ్ ఎస్‌టి7
హ్యోసంగ్ ఇండియా డిఎక్‌కె మోటోవీల్స్ ద్వారా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం దేశీయ విపణిలో నాలుగు రకాల హ్యోసంగ్ మోటార్‌సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. అవి:
1. హ్యోసంగ్ జిటి250ఆర్ - రూ.2.75 లక్షలు
2. హ్యోసంగ్ జిటి650ఎన్ - రూ.3.87 లక్షలు
3. హ్యోసంగ్ జిటి650ఆర్ - రూ.4.83 లక్షలు
4. హ్యోసంగ్ ఎస్‌టి7 - రూ.5.79 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


Click it and Unblock the Notifications








