ఆగస్టు 9న మార్కెట్లోకి రానున్న సరికొత్త కవాసకి నిన్జా 650ఆర్

స్పోర్ట్స్ బైక్ ప్రియులకు కవాసకి బ్రాండ్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదేమో. దేశీయ ఆటో దిగ్గజం బజాజ్ ఆటో, కవాసకి కంపెనీలు సంయుక్తంగా కలిసి ఇండియన్ మార్కెట్లో హై-ఎండ్ స్పోర్ట్స్ బైక్‌లను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. బజాజ్ ఆటో ద్వారా కవాసకి తమ మోటార్‌సైకిళ్లను భారత మార్కెట్లో విక్రయిస్తోంది.

ప్రస్తుతం కవాసకి దేశీయ విపణిలో అందిస్తున్న స్పోర్ట్స్ బైక్ 'కవాసకి నిన్జా 650ఆర్'లో ఓ సరికొత్త వేరియంట్‌ను కంపెనీ ఈ వారంలో మార్కెట్లో విడుదల చేయనుంది. ప్రీమియం మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో పలు విదేశీ కంపెనీలు భారత మార్కెట్లోకి ప్రవేశించి సరికొత్త మోడళ్లను అందిస్తున్న నేపథ్యంలో, ఈ సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

ఇందులో భాగంగానే, 2012 వెర్షన్ కవాసకి నిన్జా 650ఆర్ స్పోర్ట్స్ బైక్‌ను కంపెనీ ఆగస్టు 9న మార్కెట్లో విడుదల చేయనుంది. పవర్‌ఫుల్ ఇంజన్, స్పోర్టీ లుక్, తిరుగులేని పెర్ఫామెన్స్‌లతో ఈ సరికొత్త మోటార్‌సైకిల్‌ను కంపెనీ తీర్చిదిద్దింది. ఇందులో 649సీసీ ఫోర్-స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్, డిఓహెచ్‌సి, 4-వాల్వ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 72 బిహెచ్‌పిల శక్తిని, 65 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 6-స్పీడ్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది.

సరికొత్త 2012 వెర్షన్ కవాసకి నిన్జా 650ఆర్ స్పోర్ట్స్ బైక్ మూడు ఆకర్షనీయమైన రంగుల్లో (మెటాలిక్ స్పార్క్ బ్లాక్, క్యాండీ లైమ్ గ్రీన్, ప్యాషన్ రెడ్) లభిస్తుంది. దేశీయ విపణిలో దీని ధర రూ.5 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Monday, August 6, 2012, 12:20 [IST]
English summary
The new 2012 Kawasaki Ninja 650 R is set to be launched in India on August 9th. The new sports bike has received several updates both on the design front and in features. The new Kawasaki Ninja 650 R is expected to be more expensive than the current model. The price is expected to be slightly above Rs.5 lakhs.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+