కారులో సువాసన కోసం యాంబి ప్యూర్ కార్ ఫ్రెషనర్
సువాసనలు మనసుకు ఆహ్లాదాన్ని, నూతన ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అంతేకాదు ఇవి మన మూడ్‌ని మారుస్తాయి. సాధారణంగా కార్లలో దుర్వాసన వస్తుండటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. కార్లను తరచూ శుభ్రం చేయకపోవటం, పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆయిల్ వంటి పదార్థాల కారణంగా వెలువడే దుర్వాసన, కారును ఎక్కువ సేపు ఎండలో ఉంచడం వలన కలిగే వాసనలు కారు లోపల కూర్చున్న వారిపై తీవ్ర ప్రభావాలను చూపిస్తుంటాయి.
ఒక్కోసారి మరీ ఎక్కువ దుర్వాసన వచ్చే కార్లలో అసలు కూర్చోవడానికి కూడా మనసు సహకరించదు. అందుకే ఎక్కువగా కార్ యజమానులు కార్ ఫెర్ఫ్యూమ్‌లను, కార్ ఎయిర్ ఫ్రెషనర్‌లను ఉపయోగిస్తుంటారు. అయితే, థర్డ్ పార్టీల నుంచి కొనుగోలు చేసే ఈ ఫెర్ఫ్యూమ్‌లో ఆరోగ్యానికి మంచివి కాదు. నాసిరకం పెర్ఫ్యూమ్‌ల నుంచి వెలువడే సువాసనను పీల్చడం వలన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.
ఎయిర్ ఫ్రెషనర్‌ల తయారీలో ప్రసిద్ధి గాంచిన యాంబి ప్యూర్, కార్ల కోసం సరికొత్త రేంజ్ కార్ ఫ్రెషనర్‌లను అందిస్తోంది. ఈ యాంబి ప్యూర్ కార్ ఫ్రెషనర్‌ను సింపుల్ కారులో డ్యాష్‌బోర్డుకు క్లిప్ చేస్తే చాలు. ఇది కారులో మంచి సువాసనలు వెదజల్లుతూ మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఒక్కొక్క యాంబి ఫ్రెష్ కార్ ఫ్రెషనర్ రీఫిల్ సుమారు 45 రోజుల పాటు వస్తుంది.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డోక్లే అండ్ గబ్బనా, గుచ్చి, హ్యుగో బాస్ వంటి సెంట్లను తయారు చేసే కంపెనీనే ఈ యాంబి ప్యూర్ సెంట్లను కూడా డిజైన్ చేసింది. ఇది పసిఫిక్ ఎయిర్, ఆక్వా, లావెండర్ స్పా, వెనీలా బొకెట్ అనే నాలుగు విభిన్న ఫ్లేవర్లలో లభ్యమవుతుంది. మార్కెట్లో వీటి ధరలు రూ.110 నుంచి ప్రాంభమవుతాయి. మరి మీ కారులో మంచి సువాసనలు వెలువడాలంటే, యాంబి ప్యూర్ కార్ ఫ్రెషనర్‌లను ఉపయోగించండి.


Click it and Unblock the Notifications









