డ్యూక్ 200 బుకింగ్ అమౌంట్‌ను తగ్గించిన కెటిఎమ్

KTM Duke 200
దేశపు ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో, ఆస్ట్రియన్ స్పోర్ట్ బైక్‌ల తయారీ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన సరికొత్త ఆఫ్-రోడ్, అడ్వెంచరస్ బైక్ "కెటిఎమ్ డ్యూక్ 200" బుకింగ్ కోసం ఇప్పుడు కేవలం 20 వేల రూపాయలు ఉంటే సరిపోతుంది. గడచిన జనవరి 24న దేశీయ విపణలో బజాజ్-కెటిఎమ్ విడుదల చేసిన డ్యూక్ 200 బైక్ కోసం బుకింగ్ అమౌంట్‌ను కంపెనీ రూ.30,000 లుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.

అయితే, ఆ తర్వాత బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ బైక్ విడుదల కావడంతో కెటిఎమ్ డ్యూక్ 200 బైక్‌ను చేసుకున్నా వారు తమ బుకింగ్‌లను రద్దు చేసుకని పల్సర్ 200ఎన్ఎస్‌ను బుక్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రద్దు చేసుకున్న కెటిఎమ్ బుకింగ్‌లకు కంపెనీ రూ.3,000 వసూలు చేస్తుంది. అంతేకాకుండా కెటిఎమ్ డ్యూక్ 200 బైక్ వెయిటింగ్ పీరియడ్ కూడా 90 రోజులుగా ఉండటంతో కొనుగోలుదారులు బుకింగ్‌లను రద్దు చేసుకుంటాన్నారు.

ఈ నేపథ్యంలో బుకింగ్‌లను కాపాడుకోవటానికి, కొత్త బుకింగ్‌లను ఆకర్షించడానికి గానూ, డ్యూక్ 200 బుకింగ్ మొత్తాన్ని కెటిఎమ్ రూ.30,000 నుండి రూ.20,000 లకు తగ్గించింది. కెటిఎమ్ డ్యూక్ 200 ధర రూ.1.17 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ.1.3 లక్షల లోపుగానే ఉంటుంది. అన్ని బజాజ్ ప్రోబైకింగ్ షోరూమ్‌లలో కెటిఎమ్ డ్యూక్ 200 బైక్‌ను బుక్ చేసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, February 6, 2012, 16:01 [IST]
English summary
Due to overwhelming response of its first motorcycle KTM Duke 200, the Austrian bike maker KTM has reduced the booking amount for this bike from Rs. 30,000 to Rs.20,000. KTM Duke 200 is available in India at an introductory price of Rs.1,17,500, ex-showroom Delhi.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+