రూ.1.17 లక్షల ధరకే కెటిఎమ్ డ్యూక్ 200 బైక్ విడుదల
ఆస్ట్రియన్ బైక్ మేకర్ కెటిఎమ్, దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో కంపెనీలు సంయుక్తంగా రూపొందించిన సరికొత్త ఆఫ్-రోడ్ బైక్ "కెటిఎమ్ డ్యూక్ 200" నేడు మార్కెట్లోకి విడుదలైంది. అత్యంత ఆకర్షనీయమైన, పోటీ ధరకే కంపెనీ ఈ బైక్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. కేవలం రూ.1.17 లక్షల ధర (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)కే బజాజ్ ఆటో లిమిటెడ్ ఈ సరికొత్త, స్టైలిష్ ఆఫ్-రోడ్ బైక్‌ను అందిస్తుంది.
For More Images Of KTM Duke 200 Bike Click Here
కెటిఎమ్ డ్యూక్ 200 మోటార్‌సైకిల్‌ను విక్రయించేందుకు గానూ, బజాజ్ ప్రోబైకింగ్ షోరూమ్‌ల (బజాజ్ 220 పల్సర్, బజాజ్ అవెంజర్ 220, కవాసకి నిన్జా 250, కవాసకి నిన్జా 650 మోడళ్లను మాత్రమే విక్రయించే బజాజ్ షోరూమ్‌ల)ను కెటిఎమ్ ఉపయోగించుకోనుంది. కెటిఎమ్ డ్యూక్ 200ను సొంతం చేసుకోవాలనుకునేవారు వెంటనే మీ సమీపంలోని బజాజ్ ప్రోబైకింగ్ షోరూమ్‌ను సంప్రదించి, మీ ఆర్డర్‌ను బుక్ చేసుకోవచ్చు.
మీకు సమీపంలోని బజాజ్/కెటిఎమ్ ప్రోబైకింగ్ షోరూమ్‌ల చిరునామా కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి. కెటిఎమ్ డ్యూక్ 200 మోటార్‌సైకిల్ గురించిన మరింత సమాచారం కోసం తెలుగు డ్రైవ్ స్పార్క్ వెబ్‌సైట్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications









