వచ్చే ఏడాది ఆరంభంలో రానున్న కెటిఎమ్ డ్యూక్ 390
ఇండియాలో స్పోర్ట్స్, రేస్ బైక్ ప్రియులను లక్ష్యంగా చేసుకొని, దేశపు ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటోతో చేతులు కలిపి భారత మార్కెట్లోకి ప్రవేశించిన ఆస్ట్రియన్ స్పోర్ట్ బైక్‌ల తయారీ కంపెనీ కెటిఎమ్ మోటార్‌సైకిల్ త్వరలోనే దేశీయ విపణిలో మరిన్ని ఉత్పత్తులను అందించేందుకు సన్నాహాలు చేస్తుంది. గ్లోబల్ మార్కెట్లో ఇప్పటికే రెండు డజన్లకు పైగా విభిన్న మోడళ్లలో, విభిన్న అవసరాల కోసం మోటార్‌సైకిళ్లను అందిస్తున్న కెటిఎమ్, ప్రస్తుతం ఇండియాలో కేవలం ఒకే ఒక ఉత్పత్తిని (డ్యూక్ 200) మాత్రమే ఆఫర్ చేస్తోంది.
అయితే, కెటిఎమ్ డ్యూక్ 200 కన్నా మరింత పవర్‌ఫుల్, ప్రీమియం, స్పోర్టీ బైక్ కోరుకునే వారి కోసం కంపెనీ తమ కొత్త 'డ్యూక్ 390' మోటార్‌సైకిల్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. వచ్చే ఏడాది ఆరంభంలో కెటిఎమ్ డ్యూక్ 390 అందుబాటులోకి రానుంది. ఇందులో 375సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 44 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేయనుంది. ఇందులో 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, హై-క్వాలిటీ సస్పెన్షన్, బాష్ ఏబిఎస్‌లు ప్రధానంగా చెప్పుకోదగిన ఫీచర్లు. ప్రీమియం బైక్ మార్కెట్లో చిచ్చు పెట్టేందుకు వస్తున్న ఈ కెటిఎమ్ డ్యూక్ 390పై ఓ కన్నేయండి మరి..!

కెటిఎమ్ డ్యూక్ 390

కెటిఎమ్ డ్యూక్ 390

కెటిఎమ్ డ్యూక్ 390

కెటిఎమ్ డ్యూక్ 390

కెటిఎమ్ డ్యూక్ 390

కెటిఎమ్ డ్యూక్ 390

కెటిఎమ్ డ్యూక్ 390

కెటిఎమ్ డ్యూక్ 390

కెటిఎమ్ డ్యూక్ 390

కెటిఎమ్ డ్యూక్ 390

కెటిఎమ్ డ్యూక్ 390

కెటిఎమ్ డ్యూక్ 390

కెటిఎమ్ డ్యూక్ 390

కెటిఎమ్ డ్యూక్ 390

కెటిఎమ్ డ్యూక్ 390

కెటిఎమ్ డ్యూక్ 390
ప్రస్తుతం విపణిలో కంపెనీ అందిస్తున్న కెటిఎమ్ డ్యూక్ 200 మోటార్‌సైకిల్ విషయానికి వస్తే.. ఆఫ్-రోడ్ అడ్వెంచర్లకు, డ్రాగ్ రేసింగ్‌లకు, పవర్‌ఫుల్ బైక్ స్టంట్‌లకు అనువుగా ఉండే ఈ స్పోర్ట్స్ బైక్ మంచి హ్యాండ్లింగ్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఉపయోగించిన 200సీసీ ఇంజన్ గరిష్టంగా 25 బిహెచ్‌పిల శక్తిని, 20 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రిక్ స్టార్ట్, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్, 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, 10.5 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్, ఓ (O) రింగ్ చైన్, 170 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ వంటి విశిష్టమైన ఫీచర్లు కెటిఎమ్ డ్యూక్ 200 సొంతం.


Click it and Unblock the Notifications








