కేవలం రూ.720లకే కెటిఎమ్ ప్రొటెక్టివ్ అవుట్‌డోర్ బైక్ కవర్
ఈ నేపథ్యంలో ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ మేకర్ కెటిఎమ్ ప్రవేశపెట్టిన కెటిఎమ్ డ్యూక్200 బైక్ కోసం, వర్షాకాలంలో వానల బారి నుండి బైక్‌ను రక్షించేందుకు గాను ఓ సరికొత్త ప్రొటెక్టివ్ అవుట్‌డోర్ బైక్ కవర్‌ను విడుదల చేసింది. కెటిఎమ్ బైక్ కలర్‌లోనే (ఆరెంజ్ కలర్) ఉండి, కెటిఎమ్ బ్రాండ్‌ను కలిగి ఉంటుంది. ప్రత్యేక ఫ్యాబ్రిక్ మెటీరియల్‌తో తయారైన ఈ అవుట్‌డోర్ బైక్ కవర్ పూర్తిగా వాటర్-ప్రూఫ్‌ను కలిగి ఉండి చిన్న నీటి చుక్కను సైతం బైక్‌పై పడకుండా ఉండేలా చేస్తుంది.
ఈ బైక్ కవర్‌ను కేవలం వర్షాకాలంలో మాత్రమే కాకుండా, అన్ని సీజన్లలో ఉపయోగించుకోవచ్చు. దుమ్ము ధూళి సైతం మీ బైక్ పడకుండా ఉంచేందుకు ఈ బైక్ కవర్ తోడ్పడుతుంది. అంతేకాకుండా... ఒకవేళ మీరు బైక్‌ను చెట్టు క్రింద పార్క్ చేసినట్లయితే, పక్షులు వేసే రెట్టల నుంచి సైతం రక్షణ పొందవచ్చు (సాధారణంగా ఈ సమస్యను ప్రతి ఒక్కరూ అనుభవించే ఉంటారు).
అవసరం లేదనుకున్నప్పుడు మడచి పెట్టి, భద్రపరచుకునేందుకు వీలుగా దీనికి తోడు ఓ బ్యాగ్‌ను కూడా ఇవ్వబడుతుంది. ఇన్ని విధాలుగా ఉపయోగపడే ఈ బైక్ కవర్ ధర కేవలం రూ.720లు మాత్రమే. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కెటిఎమ్ డీలర్ల వద్ద ఈ ఆరెంజ్ ప్రొటెక్టివ్ బైక్ కవర్ లభ్యమవుతుంది.


Click it and Unblock the Notifications









