హెల్మెట్ లేకుండా మహిళలు చచ్చిపోయిన ఫర్వాలేదా..?
దీని స్పందించిన ఓ భారతీయ పౌరుడు, మోటార్ వాహన చట్టంలోని ఈ సడలింపును సవాల్ చేస్తూ ఓ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (పిఐఎల్) అఫడవిట్‌ను ఢిల్లీ హైకోర్టులో ఫైల్ చేశాడు. ఈ అఫడవిట్‌కు వివరణ ఇవ్వాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు, ఢిల్లీ సర్కారును కోరింది. దీనిపై స్పందించిన ఢిల్లీ సర్కారు, మోటార్ వాహన చట్టంలోని నిబంధనలనే తాము అనుసరిస్తున్నామని, అందులో ఉన్న విధంగానే మహిళలు, సిక్కులు హెల్మెట్ ధరించాల్సిన అవసరం లేదని వివరించింది.
పోలీసు గణాంకాల ప్రకారం, 2010లో టూవీలర్‌పై ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదాల బారినపడిన 64 మంది మహిళలు మరణించారు. గడచిన సంవత్సరం జూన్ నెల వరకూ ఉన్న అధికారిక లెక్కల ప్రకారం 37 మంది మహిళలు మృతి చెందారు. ఇవన్నీ అధికారిక గణాంకాలు మాత్రమే. ఇలా ప్రభుత్వం లెక్కల్లోకి రాకుండా టూవీలర్‌పై మరణించిన వారి సంఖ్య మరెంత ఉంటుందో మనమే ఊహించుకోవాలి.
ఏదేమైనప్పటికీ, చట్టంలో ఉన్నా లేకపోయినా, మహిళలైనా లేక పురుషులైనా ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్లపై సురక్షితంగా ప్రయాణించాలంటే హెల్మెట్ ధరించడం తప్పనిసరి. మీరేమంటారు..?


Click it and Unblock the Notifications









