అక్టోబర్ 11న విడుదల కానున్న కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 500
ఇండియన్ హ్యార్లీ డేవిడ్‌సన్ బ్రాండ్‌గా చెప్పుకునే రాయల్ ఎన్‌ఫీల్డ్ గడచిన జనవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన సరికొత్త 'థండర్‌బర్డ్ 500' మోటార్‌సైకిల్‌ను ఈనెల 11న మార్కెట్లో విడుదల చేయనుంది. దాదాపు సంవత్సర కాలం పాటు బుల్లెట్ ప్రియులను ఊరించిన ఈ ముద్దుగుమ్మ సెప్టెంబర్ 11, 2012న దేశీయ విపణిలోకి రానుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 500 మోటార్‌సైకిల్ అధునాత సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక ఫీచర్ల కలయితో రూపుదిద్దుకుంది. ఈ కొత్త థండర్‌బర్డ్ 500 రెండవ తరానికి (సెకండ్ జనరేషన్) చెందినది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 500 - ఇంజన్
* 499సీసీ సింగిల్ సిలిండర్ ట్విన్‌స్పార్క్, ఓహెచ్‌వి ఎయిర్ కూల్డ్ ఇంజన్
* గరిష్ట పవర్ - 5250 ఆర్‌పిఎమ్ వద్ద 27.2 బిహెచ్‌పి
* గరిష్ట టార్క్ - 4000 ఆర్‌పిఎమ్ వద్ద 41.3 ఎన్ఎమ్
* బోర్ x స్ట్రోక్ : 84 x 90 మి.మీ.
* కంప్రెషన్ నిష్పత్తి - 8.5:1
* గేర్ బాక్స్: 5-స్పీడ్ కాన్‌స్టాంట్ మెష్
* డిజిటల్ ఎలక్ట్రానిక్ ఇగ్నిషన్ సిస్టమ్

రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ - టైర్స్ & బ్రేక్స్
* ఫ్రంట్ టైర్: 90/90 - 19
* వెనుక టైర్: 120/80 - 18
* ముందు బ్రేక్: 280 మి.మీ. డిస్క్, టూ పిస్టన్ కాలిపర్
* వెనుక బ్రేక్: 240 మి.మీ. డిస్క్, సింగిల్ పిస్టన్ కాలిపర్

థండర్‌బర్డ్ - సస్పెన్షన్ & ఎలక్ట్రికల్స్
* ముందు సస్పెన్షన్: టెలిస్కోపిక్ 41 మి.మీ. ఫోర్క్స్, 130 మి.మీ. స్ట్రోక్
* వెనుక సస్పెన్షన్: ట్విన్ గ్యాస్ ఛార్జ్‌డ్ షాక్ అబ్జార్వర్స్ 80 మి.మీ. స్ట్రోక్
* ప్రొజెక్షన్ టైప్ హెడ్‌ల్యాంప్స్ (హెచ్7 బల్బ్ 55/55 వాట్)
* ఎల్ఈడి టెయిల్‌ల్యాంప్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ - కొలతలు
* 20 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం
* 2060 మి.మీ. పొడవు
* 1300 మి.మీ. ఎత్తు
* 896 మి.మీ. వెడల్పు
* 1350 మి.మీ. వీల్‌బేస్
* 195 కేజీలు బరువు

రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ - ధర
అంచనా ధర రూ.1.2 లక్షల నుంచి రూ.1.5 లక్షల రేంజ్.

రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 500 - విడుదల
రాయల్ ఎన్‌ఫీల్డ్ గడచిన జనవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన సరికొత్త 'థండర్‌బర్డ్ 500' మోటార్‌సైకిల్‌ను రేపు మార్కెట్లో విడుదల చేయనుంది. దాదాపు సంవత్సర కాలం పాటు బుల్లెట్ ప్రియులను ఊరించిన ఈ ముద్దుగుమ్మ సెప్టెంబర్ 11, 2012న దేశీయ విపణిలోకి రానుంది.
మొదటి తరం (ఫస్ట్ జనరేషన్) థండర్‌బర్డ్ 500 ఇప్పటికే మార్కెట్లో భారీ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. కాగా... తాజాగా సరికొత్త హంగులతో ముస్తాబయి వస్తున్న ఈ కొత్త తరం థండర్‌బర్డ్ 500 కూడా మార్కెట్లో అంతకు మించిన సక్సెస్‌ను సాధించగలదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మోడల్‌కు ఇప్పటికే మార్కెట్లో భారీ హైప్ ఉంది. ఇది మార్కెట్లోకి ప్రవేశించిన కొద్ది రోజుల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోవటం ఖాయమని తెలుస్తోంది. కొత్త థండర్‌బర్డ్ రెండు వేరియంట్లలో (500సీసీ, 350సీసీ) లభ్యం కానుంది.
ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న క్లాసిక్ 500, 350 బుల్లెట్‌లలో ఉపయోగిస్తున్న ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్ ట్విన్ స్పార్క్ ఇంజన్‌లనే రీట్యూన్ చేసి వీటిల్లో ఉపయోగించనున్నారు. కొత్త థండర్‌బర్డ్ అత్యాధునిక హంగులతో మార్కెట్లోకి రానున్న కారణంగా, ధర పరంగా చూసుకుంటే ఇది మునుపటి వెర్షన్ల కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్‌లో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఫ్యూయెల్ ఇంజక్షన్, గ్యాస్-ఛార్జ్‌డ్ సస్పెన్షన్, రియర్ డిస్క్ బ్రేక్, డిజిటల్ ఎల్‌సిడి కన్సోల్ వంటి అనేక అధునాత ఫీచర్లు ఉన్నాయి. దేశీయ విపణిలో దీని ధర రూ.1.2 లక్షల నుంచి రూ.1.5 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








