సెలక్ట్ స్కూటర్‌ను రీ-లాంచ్ చేసిన ఎల్ఎమ్ఎల్
గడచిన 2005-06 లాకౌట్ అయిన ఈ కంపెనీ తిరిగి 2010లో కార్యకలాపాలు ప్రారంభించింది. ఎల్ఎమ్ఎల్ తొలుత తమ ఉత్పత్తులను ఉత్తర భారతదేశంలో విడుదల చేసేది. ఆ తర్వాతనే ఎల్ఎమ్ఎల్ స్కూటర్లకు ఎక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంటుందో, అటువంటి మార్కెట్లో ఉత్పత్తులను విడుదల చేస్తుంది. గోవా కూడా ఇటువంటి మార్కెట్లలో ఒకటి.
ఎల్ఎమ్ఎల్ తాజాగా.. 4-స్ట్రోక్ ఇంజన్‌తో కూడిన రిఫ్రెష్డ్ "సెలక్ట్" స్కూటర్‌ను గోవాలో విడుదల చేసింది. గోవాలో దీని ధర రూ.53,875 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇందులో ఉపయోగించిన 147.5సీసీ ఇంజన్ 6,250 ఆర్‌పిఎమ్ వద్ద 6.5 కి.వా. శక్తిని, 4,250 ఆర్‌పిఎమ్ వద్ద 11.3 ఎన్.ఎమ్. టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్, డ్రమ్ బ్రేక్స్‌తో లభిస్తుంది. దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 5.5 లీటర్లు.
ఎల్ఎమ్ఎల్ సెలక్ట్ స్కూటర్ లీటరు పెట్రోల్‌కు 80 కి.మీ. వరకూ మైలేజీనివ్వవచ్చని అంచనా. కొత్త ఎల్ఎమ్ఎల్ సెలక్ట్ స్కూటర్‌లో స్పష్టమైన హెడ్‌లైట్ లెన్స్, ఆరెంజ్ బల్బ్‌తో కూడిన వైట్ టర్న్ ఇండికేటర్స్, మెటాలిక్ పెయింట్, సరికొత్త డిజైన్ కలిగిన ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ వంటి కాస్మోటిక్ మార్పులను గమనించవచ్చు. మరి ఎల్ఎమ్ఎల్ కంపెనీ ఈ స్కూటర్‌ను మన మార్కెట్‌లో విడుదల చేస్తుందో లేదో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications









