లోహియా జీనియస్ ఎలక్ట్రిక్ స్కూటక్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

మొరాదాబాద్‌ (ఉత్తరప్రదేశ్‌)లోని లోహియా గ్రూపు చెందిన ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీ విభాగం లోహియా ఆటో అందిస్తున్న 'జీనియస్' ఎలక్ట్రిక్ స్కూటర్ నిజంగా జీనియస్ అనే చెప్పవచ్చు. ప్రస్తుతం పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలను కొనుగోలు చేయటం ఎంతో ఉత్తమం. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి తక్కువ ఖర్చుతో పనిచేసే ఎలక్ట్రిక్ వాహనాలు. సిటీల్లో ప్రయాణించే వారికి, తక్కువ దూరం ట్రావెల్ చేసే వారికి ఎలక్ట్రిక్ బైక్‌లు చక్కగా సరిపోతాయి.

సమయానుసారంగా వీటిని ఛార్జ్ చేసుకుంటూ, అవసరమైనప్పుడు బ్యాటరీలను మార్చుకోవటం ద్వారా ఇవి ఎక్కువ కాలం మన్నుతాయి. వీటి మెయింటినెన్స్, రన్నింగ్ కాస్ట్‌లు కూడా అత్యల్పంగానే ఉంటుంది. లోహియా ఆటో అందిస్తున్న 'జీనియస్' అనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అమర్చిన బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 70 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించవచ్చు. పైపెచ్చు జీనియస్ ఈ-స్కూటర్‌ను నడపేందుకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరమే లేదు.

లోహియా జీనియస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ యొక్క విశిష్టతలను గమనిస్తే..
* గరిష్ట వేగం - గంటకు 25 కి.మీ.
* రేంజ్ - పూర్తి ఛార్జ్‌పై 70 కి.మీ.
* సీటింగ్ కెపాసిటీ - ఇద్దరు వ్యక్తులు
* కొలతలు (పొడవు x వెడల్పు x ఎత్తు) - (1825 మి.మీ. x 675 మి.మీ. x 1020 మి.మీ.)
* మోటార్ టైప్, అవుట్‌పుట్ (వాట్స్) - బిఎల్‌డిసి, 250 వాట్స్
* మోటార్ ఇన్‌పుట్ వోల్టేజ్ - 48 వోల్ట్స్
* బ్యాటరీ టైప్/వోల్టేజ్ - మెయింటినెన్స్ ఫ్రీ, విఆర్ఎల్ఏ, జెల్ టైప్, 12 వోల్ట్
* బ్యాటరీ కెపాసిటీ - 20 ఆంప్స్
* ఛార్జింగ్ టైమ్ - 6 నుండి 8 గంటలు
* డ్రమ్ బ్రేక్స్, టెలిస్కోపిక్ సస్పెన్షన్

జీనియస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు (బ్లూ, రెడ్ మరియు యల్లో) ఆకర్షణీమైన రంగుల్లో లభిస్తుంది. భారత మార్కెట్లో జీనియస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.25,495 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. మరిన్ని వివరాల కోసం lohiaauto.com ను సందర్శించండి.

More from DriveSpark

Article Published On: Thursday, May 17, 2012, 12:04 [IST]
English summary
UP based electric bike maker Lohia Auto is offering a new electric bike called 'Genius'. The new Genius is equipped with a special VRLA maintenance free battery type with a capacity of 48V. Battery charging time is 6-8 hours and it can run upto 70 km. The price of new Genius is Rs. 25,495 (ex-showroom, Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+