అత్యంత తక్కువ ధరకే హీరో మోటోకార్ప్ బైక్‌లు!

జపాన్ భాగస్వామి హోండాతో విడాకులు తీసుకున్న ప్రపంచపు అగ్రగామి ద్విచక్ర వాహన కంపెనీ 'హీరో మోటోకార్ప్' (గతంలో హీరో హోండా) ఇకపై మార్కెట్లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుని అమ్మకాలను భారీగా పెంచుకునేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగా ద్విచక్ర వాహనాల ధరలను రూ.20,000 - రూ.30,000 రేంజ్‌లో ధరలను తగ్గించాలని కంపెనీ భావిస్తోంది.

ప్రస్తుతం హీరో మోటోకార్ప్ అందిస్తున్న చౌవక మోటార్ సైకిల్ సిడి డాన్ (ఎక్స్-షోరూమ్ ధర రూ.34,500). దీని కన్నా తక్కువ ధరకే మార్కెట్లో ఉత్పత్తులను అందిచడం ద్వారా మార్కెట్ వాటాను విస్తృత స్థాయిలో పెంచుకుని, ద్విచక్ర వాహన విభాగంలో తిరుగులేని శక్తిగా నిలవాలని హీరో మోటోకార్ప్ యోచిస్తోంది. ముఖ్యంగా మోపెడ్లను (టీవీఎస్ ఎక్స్ఎల్ వంటివి) వినియోగించే కస్టమర్లను బైక్‌ల వైపుకు మళ్లించాలనే లక్ష్యంతో హీరో మోటోకార్ప్ పావులు కదుపుతుంది.

ఈ ప్రైస్ రేంజ్ సెగ్మెంట్లో మంచి అవకాశాలు ఉన్నాయని, అందుకే ఇలాంటిదేది ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో తాము ఉన్నామని, అయితే ప్రస్తుత ఉత్పాదక వ్యయాలు, పెరిగిన ధరలను బట్టి చూస్తే ఇది అనుకున్నంత సులువైనది కాకపోయినప్పటికీ, దీన్ని నిజం చేసేందుకు తమ వద్ద ప్రణాళికలున్నాయని హీరో మోటోకార్ప్ మేనేజింగ్ డైరెక్టర్ ఓ ఆంగ్ల పత్రికతో తెలిపారు.

ప్రస్తుతం విక్రయిస్తున్న మోడళ్ల కన్నా తక్కువ ధరకే వీటిని అందిచాలనుకుంటున్నామని, ఎలాంటి వ్యక్తిగత రవాణా సదుపాయం లేని వారిని దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించనున్నామని ఆయన తెలిపారు. హీరో మోటోకార్ప్ ఇటీవలే అమెరికాకు చెందిన ఎరిక్ బ్యూయెల్ మోటార్‌సైకిల్ కంపెనీతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Wednesday, March 14, 2012, 17:06 [IST]
English summary
World's biggest two-wheeler manufacturer Hero MotoCorp is now planning to create new low-cost bike segment in Indian two-wheeler market. This will help the company further consolidate its strong hold in the domestic mass biking segment. The company is planning to cut prices to Rs 20,000-30,000 range to woo moped users.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+