మహీంద్రా డ్యూరో టెస్ట్ డ్రైవ్ ఛాలెంజ్.. మీరు పాల్గొన్నారా..?

హైదారాబాద్: దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్)కు చెంది ద్విచక్ర వాహన విభాగం "మహీంద్రా టూవీలర్స్" రాష్ట్ర మార్కెట్లోకి తాజాగా విడుదల చేసిన సరికొత్త 125 సీసీ గేర్‌లెస్ స్కూటర్ "డ్యూరో డిజెడ్ 125" అమ్మకాలను పెంచుకునేందు కోసం కంపెనీ ఓ వినూత్న ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.

ఈ ఆఫర్‌లో భాగంగా.. కొత్త డ్యూరో డిజెడ్‌ 125 స్కూటర్‌ను టెస్ట్ రైడ్ చేసిన తర్వాత కూడా వేరే బ్రాండ్ స్కూటర్‌ను కొనాలని నిర్ణయించుకునే కస్టమర్లకు రూ.500 చెల్లిస్తామని మహీంద్రా టూవీలర్స్ పేర్కొంది. కొనుగోలుదారుల ఇష్టాఇష్టాలను అర్థం చేసుకొని, విస్తృతమైన రీసెర్చ్ చేసిన తర్వాతనే, సరికొత్త హంగులతో ఈ స్కూటర్‌ను డిజైన్ చేశామని కంపెనీ పేర్కొంది.

శక్తివంతమైన 125సీసీ ఇంజన్‌ను కలిగిన కొత్త డ్యూరో డిజెడ్, మెరుగైన మైలేజ్‌ను ఇవ్వటమే కాకుండా, సౌకర్యవంతమైన సస్పెన్షన్‌ను కూడా కలిగి ఉంది. రాత్రివేళ్ల మంచి కాంతినిచ్చే హాలోజన్ బల్బ్‌తో కూడిన వెడల్పాటి హెడ్ లైట్, సురక్షితమైన బ్రేకింగ్ కోసం అమర్చిన బ్రేక్ లీవర్ లాక్, వస్తువులను భద్రపరచుకునేందుకు ముందు వైపు స్టోరేజ్ వ్యవస్థ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

అందరికీ అందుబాటులో ఉండేలా ఆకర్షనీయమైన ధరకే మహీంద్రా టూవీలర్స్ ఈ స్కూటర్‌ను అందిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో ఈ స్కూటర్ ధర రూ.44,640 (ఎక్స్‌-షోరూమ్)గా ఉంది. ఇది లీటరు పెట్రోల్‍‌కు 53-56 కి.మీ రేంజ్‌లో మైలేజీనిస్తుంది.

Article Published On: Saturday, March 10, 2012, 14:27 [IST]
English summary
Mahindra is offering Rs.500 to people who test drive its Duro DZ scooter and then decide to buy another scooter. This offer is open to all people who test drive the Duro DZ 125 in March. Mahindra Duro DZ is available with the price tag of Rs.44,640 (Ex Showroom, Hyderabad).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+