మరికొద్ది మార్కెట్లోకి రానున్న మహీంద్రా రోడియో ఆర్‌జెడ్

మహీంద్రా గ్రూపుకు చెందిన ద్విచక్ర వాహన విభాగం మహీంద్రా టూవీలర్స్ లిమిటెడ్ (ఎమ్‌టిడబ్ల్యూఎల్) నుంచి ఓ అప్‌గ్రేడెడ్ స్కూటర్ రానుందని ఇదివరకే తెలుగు డ్రైవ్ స్పార్క్ ప్రచురించిన సంగతి తెలిసిందే. కాగా.. మహీంద్రా టూవీలర్స్ అందిస్తున్న రోడియో స్కూటర్‌లో ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌ను నేడు తమిళనాడు మార్కెట్లో విడుదల చేసింది. చెన్నై మార్కెట్లో మహీంద్రా రోడియో ఆర్‌జెడ్ 125సీసీ స్కూటర్ ధర రూ.49,410 (ఎక్స్-షోరూమ్)గా ఉండగా, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో దీని ధర రూ.49,575 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

పాత మహీంద్రా రోడియో స్కూటర్‌తో పోల్చుకుంటే ఎన్నో మెరుగ్గా ఉండే ఈ సరికొత్త రోడియో ఆర్‌జెడ్‌ను తీర్చిదిద్దామని కంపెనీ పేర్కొంది. అధునాతన 125సీసీ జెడ్ సిరీస్ ఇంజన్‌‌తో రూపొందించిన మహీంద్రా రోడియో ఆర్‌జెడ్ స్కూటర్ మంచి పికప్‌ను మాత్రమే కలిగి ఉండటమే కాకుండా, మంచి మైలేజ్‌ను కూడా అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఇంజన్‌లో అప్‌డేటెడ్ డ్యూయల్-కర్వ్ డిజిటల్ ఇగ్నిషన్ సిస్టమ్ (డిసిడిఐ)ను ఉపయోగించిన కారణంగా ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, లీటర్ పెట్రోల్‌కు 59.38 కి.మీ. మైలేజీనిస్తుందని మహీంద్రా వెల్లడించింది.


ఈ పవర్‌ఫుల్ స్కూటర్ అడ్వాన్స్‌డ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ను, అధిక గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉండి ఎటువంటి రోడ్లపై అయినా సరే సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. ప్రస్తుతం ఇండియాలో లభిస్తున్న ఏ స్కూటర్లలో కూడా టాకోమీటర్, ట్రిప్‌మీటర్, యాక్సిలరేషన్ టైమర్, ఓడోమీటర్, స్పీడోమీటర్, ఓవర్‌స్పీడ్ అలారమ్, ఫ్యూయెల్ గ్యేజ్, క్లాస్, సైడ్ స్టాండ్ బజర్‌తో కూడిన డిజిటల్ డ్యాష్‌బోర్డ్ లేదు. ఇది ఒక్క రోడియో ఆర్‌జెడ్ స్కూటర్‌లో మాత్రమే లభిస్తుంది.

రోడియో ఆర్‌జెడ్‌లో ఉండే ఈ డిజిటిల్ డ్యాష్‌బోర్డుకు మరొక ప్రత్యేకత ఉంది. ఇందులోని బ్యాక్‌లైట్‌ను మనకు నచ్చిన విధంగా ఏడు రంగులలో ఏదో ఒక రంగులోకి మార్చుకోవచ్చు. ఈ స్కూటర్‌లో మొబైల్ ఫోన్‌ను ఛార్జ్ చేసుకునేందుకు ఓ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. నకిలీ తాళం చెవుల ద్వారా స్కూటర్‌ను ఆన్ చేయకుండా ఉంచేందుకు ఇందులో ఫోర్-ఇన్-వన్ యాంటీ-థెఫ్ట్ కీని అమర్చారు. నేటి యువతను దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేసిన కొత్త రోడియో ఆర్‌జెడ్ మార్కెట్లో మంచి సక్సెస్‌ను సాధించటం ఖాయం.

మహీంద్రా రోడియో ఆర్‌జెడ్ స్కూటర మైస్టిక్వ్ వైలెట్, ఎలక్ట్రిక్ గ్రీన్, ఫ్లేమ్ ఆరెంజ్‌లతో పాటుగా మొత్తం ఏడు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యం కానుంది. బాడీ కలర్‌లో ఉండే సైడ్ మిర్రర్స్ ఈ స్కూటర్‌కు మరింత స్టయిల్‌ను చేకూర్చనున్నాయి. దక్షిణ భారతదేశంలో మహీంద్రా రోడియో ఆర్‌జెడ్ స్కూటర్ ధరలు క్రింది విధంగా ఉన్నాయి.
* ఆంధ్రప్రదేశ్ - రూ. 49,575
* కేరళ - రూ. 49,410
* తమిళనాడు - రూ. 50,710
* కర్ణాటక రూ. 48,930

More from DriveSpark

Article Published On: Wednesday, June 20, 2012, 19:19 [IST]
English summary
Mahindra Two Wheelers, a part of the $ 15.4 billion Mahindra Group, today announced the launch of the new Mahindra Rodeo RZ in South India, a modern, stylish and feature-packed scooter which is all set to storm the Indian scooter market.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+