కెటిఎమ్ డ్యూక్ 200 బైక్ కోసం రేస్‌లైన్ స్టిక్కర్స్

మీరు కెటిఎమ్ డ్యూక్ 200 బైక్‌ని ఉపయోగిస్తున్నారా..? మీ స్పోర్ట్స్ బైక్‌కి మరింత స్పోర్టీ లుక్ ఇవ్వాలనుకుంటున్నారా..? అయితే, మీ కోసమే కెటిఎమ్ సరికొత్త కస్టమ్ 'రేస్‌లైన్' స్టిక్కర్లను విడుదల చేసింది. ఈ స్టిక్కర్లను మీ కెటిఎమ్ డ్యూక్ 200 మోటార్‌సైకిల్‌కు అంటిస్తే, మీ బైక్ మరింత స్పోర్టీ లుక్‌తో ఓ రేస్ బైక్‌ను తలపిస్తుంది. ఈ స్టిక్కర్లను ఫ్యూయెల్ ట్యాంక్ కోసం డిజైన్ చేశారు.

కెటిఎమ్ డ్యూక్ 200 మోటార్‌సైకిల్‌ ఫ్యూయెల్ ట్యాంక్‌పై అటు, ఇటు రెండువైపులా ఈ స్టిక్కర్లను అంటిచవచ్చు. అంతేకాకుండా, ముందువైపు షాక్ అబ్జార్వర్స్ కోసం డబ్ల్యూపి స్టిక్కర్స్, రియర్ సీట్ కౌల్ (ప్యానెల్), ఇంజన్ కౌల్, ఫ్రేమ్స్, రిమ్స్ కోసం రేసింగ్ స్టిక్కర్స్ వంటివి ఈ కిట్‌లో పొందవచ్చు. ఈ మొత్తం కిట్ ధర రూ.4,560 లుగా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.


అన్ని అధీకృత బజాజ్ ప్రోబైకింగ్ షోరూమ్‌లలో (కెటిఎమ్ డ్యూక్ 200 లభ్యమయ్యే షోరూమ్‌లు) ఈ స్టిక్కర్స్ లభిస్తాయి. ఈ స్టిక్కర్లను షోరూమ్‌లోని సర్వీసింగ్ ప్రతినిధులే మీ మోటార్‌సైకిల్‌కు అంటించి ఇస్తారు. మీ స్పోర్టీ కెటిఎమ్ డ్యూక్ 200 బైక్‌కు ఈ స్పెషల్ కిట్‌ను జోడించడం వలన అది మరింత స్టయిలిష్ లుక్‌ను కలిగి ఉండి రేసింగ్ బైక్ ఫీల్‌ను ఇస్తుంది.

బజాజ్ కెటిఎమ్ డ్యూక్ 200 ఫోటో గ్యాలరీ:

ఇక కెటిఎమ్ డ్యూక్ 200 బైక్‌ విషయానికి వస్తే. ఇందులో 200సీసీ, 4-వాల్వ్ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూలింగ్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ డిఓహెచ్‌సి ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 25 బిహెచ్‌పిల శక్తిని, 20 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 9.01 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 136 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది.

ఇంకా ఇందులో ఎలక్ట్రిక్ స్టార్ట్, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్, 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, 10.5 లీటరల్ ఫ్యూయెల్ ట్యాంక్, ఓ (O) రింగ్ చైన్, 170 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ వంటి విశిష్టమైన ఫీచర్లు ఉన్నాయి. కెటిఎమ్ డ్యూక్ 200 ఎక్స్‌-షోరూమ్‌, హైదరాబాద్‌ ధర రూ.1,20,057 లుగా ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 7, 2012, 11:56 [IST]
English summary
Austrian sports bike maker KTM has introduced a new set of custom ‘raceline’ stickers kit for its all new sports bike KTM 200 Duke. This kit include two stickers for the fuel tank, WP stickers for the front shock absorbers, rear seat cowl and engine cowl, and KTM Racing stickers for the frame and rims and it is available for an introductory price of Rs 4560.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+