మీ ఫోర్డ్ ఫిగోను మరింత అందంగా తీర్చిదిద్దుకోండి

మీరు ఫోర్డ్ ఫిగో కారును ఉపయోగిస్తున్నారా..? అయితే, మీ అందమైన కారును మరింత అందంగా మార్చుకునేందుకు ఫోర్డ్ కంపెనీ కొన్ని యాక్ససరీలను అందిస్తోంది. వీటితో మీ కారును మరింత స్టయిలిష్‌గా సౌకర్యవంతంగా తీర్చిదిద్దుకోవచ్చు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!!


* వినిల్ సీట్ కవర్స్ (బ్లాక్ అండ్ రెడ్):
ఫోర్డ్ ఇండియా తమ హ్యాచ్‌బ్యాక్ ఫిగో కోసం ఆకర్షనీయమైన సీట్ కవర్లను అందిస్తోంది. ఎరుపు నలుపు రంగుల కలయికతో ఉండే ఈ సీట్ కవర్లు ఈ ఫోర్డ్ ఫిగో కారుకు మరింత అందాన్ని చేకూర్చి పెట్టడమే కాకుండా, ఒరిజినల్ సీట్లు చిరిగిపోవటం, మురికిపట్టడం, దుమ్మ చేరడం వంటి వాటి నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇందులో మరింత కంఫర్ట్ ఫీల్, ప్రీమియం లుక్ కావాలనుకునే వారు లెథర్ సీట్ కవర్స్ ఆప్షన్‌ను కూడా ఎంచుకోవచ్చు. సాధారణ సీట్ కవర్స్ ధర రూ.4,300 లుగా ఉండగా, లెథర్ సీట్ కవర్స్ ధర రూ.9,003 లుగా ఉంది.

* గేర్ నాబ్ కవర్:
ఇది గేర్ నాబ్‌ను కవర్ చేస్తుంది. ఇంటీరియర్ లుక్‌ని పెంచడమే కాకుండా, గేర్ నాబ్ అల్యూమినియం ఫినిషింగ్ ఎక్కువ కాలం మన్నడంలో తోడ్పడుతుంది. తరచూ గేరును మార్చేటప్పుడు సున్నితమైన హ్యాండ్లింగ్ అనుభూతిని ఇది కల్పిస్తుంది. దీనిని అమర్చడం, తొలగించడం చాలా సులువు. ఈ గేర్ నాబ్ ధర రూ.1,652 లుగా ఉంది.

* స్కఫ్ ప్లేట్స్ కిట్:
స్కఫ్ ప్లేట్స్‌ను డోర్‌కు క్రింది భాగంలో ఉండే ఫుట్ ఫ్లాట్‌ఫామ్‌పై అమర్చుతారు. మొత్తం నాలుగు డోర్లలో నాలుగు ప్లేట్లను అమర్చుకోవచ్చు. వీటిని ప్రత్యేక ఆటోమోటివ్ గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేస్తారు. వీటిపై ఫిగో బ్రాండింగ్ ఉంటుంది. స్క్రాచెస్, డ్యామేజ్‌ల కావడాన్ని స్కఫ్ ప్లేట్స్ తగ్గిస్తాయి. ఈ స్కఫ్ ప్లేట్స్ ధర రూ.1,003 లుగా ఉన్నాయి.

* రిమోట్ బూట్ రిలీజ్ కిట్:
బూట్‌ను (కారు వెనుక డోర్) రిలీజ్ చేయడానికి కారులో నుంచి దిగి బయటకు రావాల్సిన అవసరం లేకుండా డ్యాష్ బోర్డ్‌లో చిన్న స్విచ్‌ను నొక్కగానే ఆటోమేటిక్‌గా బూట్ రిలీస్ అవుతుంది. ఇదొక సౌకర్యవంతమైన ఫీచర్. ఈ రిమోట్ బూట్ రిలీజ్ కిట్ ధర రూ.3,993 లుగా ఉంది.

ఈ యాక్ససరీలన్నింటిన ఫోర్డ్ అధీకృత డీలర్ల వద్ద లేదా సర్వీస్ సెంటర్ల వద్ద పొందవచ్చు. బయటి మార్కెట్లో నకిలీ ఉత్పత్తులను కొనుగోలు చేసి మోసపోవటానికి బదులు, కంపెనీ నుంచే నాణ్యమైన ఉత్పత్తులను కొనుగోలు చేయటం ఉత్తమం.

More from DriveSpark

Article Published On: Tuesday, July 17, 2012, 18:29 [IST]
English summary
You can make you Ford Figo extra special by adding these accessories available at all ford showrooms. The most notable among them are the Vinyl Seat Covers, Black & Coral Red, Gear Knob Bezel, Op Alu Finish, Scuff Plates Kit, Remote Boot Release Kit etc.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+